తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు తాజాగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి నరసింహులు సోమాజీగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కొంచి విషమంగా ఉండటంతో వైద్యులు మోత్కుపల్లిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం మరింత క్షిణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగు కాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. దీంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
ఇదిలాఉంటే..తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక్కరోజులో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,555 మంది కోలుకున్నారు.