బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో పాల్గొన్నారు బిజేపి మహిళా నేత పురంధ్రీశ్వరి. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన నిర్వహిస్తోన్న కార్యక్రమాలు వేరైనా ఇరు పార్టీల మధ్య పొత్తు మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే, మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమతో చర్చిస్తే, తాము కూడా స్పందిస్తామని ఆమె చెప్పారు. ప్రణాళికలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఏపీ సర్కారు విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయని ఆమె చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర సర్కారుకి వివరిస్తామని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement