ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న పార్టీల్లో బీజేపీ మరోమారు మొదటి స్థానంలో నిలిచింది. 2022-23లో బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రూ.1300 కోట్ల విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. 2022-23లో బీజేపీకి వచ్చిన రూ.2,120 కోట్లలో 61 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవే ఉన్నాయి. ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని ఆ పార్టీ వెల్లడించింది. అంతకుముందు 2021-22లో బీజేపీకి రూ.1,775 కోట్ల విరాళాలు వచ్చాయి.
ఇక.. కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపేణా రూ.171 కోట్ల విరాళాలు వచ్చాయి. 2021-22లో వచ్చిన విరాళాలు రూ.236 కోట్లతో పోలిస్తే చాలా మట్టుకు తగ్గాయి. అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి 2021-22లో రూ.3.2 కోట్ల విరాళాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 2022-23లో రూ.34 కోట్ల విరాళాలు అందాయి.