కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని మోడీపై ఈమధ్య జరిగిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎక్కడ కూడా తెలంగాణలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని, అయినా పెద్ద మొత్తంలో నిధులు ఆ రాష్ట్రాలకే తరలిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రాల హక్కులను తమ చేతుల్లోకి తీసుకుంటూ నిధుల విషయంలో అన్యాయం చేస్తున్నారని, దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ జరగాలని కోరారు. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం లేకుండా పోతోందని.. సమాఖ్య స్ఫూర్తిని ప్రధాని మోడీ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఐఏఎస్ ఆఫీసర్లపై కూడా కేంద్రం పెత్తనం చెలాయించేలా మార్పులు చేయడానికి సమాయత్తమవుతోందని విమర్శించారు.
వీటికి తోడు.. తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఫొటోలను కాపీ కొడుతున్నారని, వారి సోషల్ మీడియాలో బీజేపీ పాలిత రాష్ట్రాలు.. కేంద్ర ప్రభుత్వం పనులు చేస్తున్నట్టు ప్రచారం నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదంతా ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలే అని ముద్దాడినట్టుందని హేలన చేశారు. దానికి సాక్ష్యంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు ఇమేజెస్‌ను షేర్ చేశారు.
బీజేపీ తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నవి ఏమిటో మీరూ చూడండి..