వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్వాదీ (ఎస్పి) అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ‘మిషన్ 2022’ను ప్రారంభించారు. ఇందులో భాగంగా కాన్పూర్ నుంచి చేపట్టిన రథయాత్ర ఈ రోజు గోరఖ్పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు..
ఈ మధ్య జరిగిన లఖింపూర్ ఖేరి ఘటనలో బీజేపీ రైతులను చిదిమేసిందని, వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో తిరిగి ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే రాజ్యాంగాన్ని కూడా నాశనం చేస్తుందని అఖిలేశ్ హెచ్చరించారు. సమాజ్వాదీ విజయ రథం ప్రజల వద్దకు వెళుతోందని, ఇక బీజేపీని తప్పకుండా గద్దె దించుతామని అన్నారు.
రైతుల హక్కులు, గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ఈ రథం ముందుకు కొనసాగుతుందని అఖిలేశ్ పేర్కొన్నారు. బీజేపీ నిరంకుశ, దేశ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్ర రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. రథయాత్ర ప్రారంభానికి ముందుకు అఖిలేష్ తండ్రి ములాయం అశీర్వాదాలు తీసుకున్నారు. ఈ యాత్రకు నోట్లరద్దు సమయంలో ఒక బ్యాంకు ఎదుట క్యూలో జన్మించిన ఖజాంచి అనే చిన్నారి జెండా ఊపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily