పాలమూరు బీజేపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. ఇవ్వాల భూత్పూరు, దేవరకద్ర మండల పార్టీ అధ్యక్షుల మధ్య జరిగిన గొడవే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇరువురు లీడర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్టు తెలుస్తోంది. ఈనెల 30న దేవరకద్ర నియోజకవర్గంలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ ఇద్దరు లీడర్ల మధ్య తలెత్తిన వివాదం వర్గ పోరులా మారింది. దీంతో భూత్పూర్ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డిపై దేవరకద్ర మండలాధ్యక్షుడు అంజన్‌కుమార్‌రెడ్డి వర్గం దాడి చేసింది. ఈ క్రమంలో భూత్పూర్ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డిని తీవ్రంగా గాయాలయ్యాయి.
కాగా, గాయపడ్డ భూపాల్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భూత్పూర్ సీఐ రజిత సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారా లేదా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ముందే దేవరకద్ర బీజేపీలో వర్గ పోరు చెలరేగడం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.