హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లి ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. అధ్యక్షుడి మార్పు ఇప్ప ట్లో ఉండదని నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తెలం గాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరి నట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థి తులు, పార్టీ బలోపేతం, ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లి ఎన్నికలకు సంబంధించిన వ్యూహ, ప్రతివ్యూ హాలను చర్చించేందుకు బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నేతలను మంగళవారం ఢిల్లికి పిలిపించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నేతలతో సమావేశానికి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, సునిల్ భన్సల్‌తో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. తెలంగాణలో తాజా పరిస్థితులను అధ్య యనం చేసిన అమిత్ షా, నడ్డా బండి సంజయ్ నాయ కత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తంచేసినట్లు సమాచారం.
ఆయా పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు పార్టీ అధ్యక్షుడి మార్పుపై గంపెడాశలు పెట్టుకున్నారు. అం దుకే సంజ య్ నాయకత్వంపట్ల ప్రధాని నరేంద్రమోడీ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో ఇదే విషయాన్ని అమిత్ షా , నడ్డా రాష్ట్ర నేతలకు చెప్పినట్లు సమా చారం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి జాతీ యస్థాయిలో ప్రత్యామ్న్యాయ పదవులు కట్టబెట్టా లన్న ఆలోచన బీజేపీ అధినాయకత్వం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ఎంతో బలోపేతమైం దని ఆయన చేస్తున్న పోరాటాలు, నిర్వ హించిన ప్రజా సంగ్రామ యాత్రల వల్ల భారాసా నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అగ్రనేతలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలతో పార్టీకి పెద్ద ఎత్తున మైలేజీ వచ్చిందని, ఈ యాత్రలను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎన్ని కుట్ర లు చేసినా , కుయుక్తులు పన్నినా మొక్కవోని ధైర్యంతో ఆయన ముందుకువెళ్లి ప్రజలకు చేరువయ్యాడని ప్రధాని మోడీ వ్యాఖ్యా నించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన బీజేపీ ప్లీనరీ సమావేశంలోనూ బండి సంజయ్ పనితీరును ప్రశంసించిన మోడీ ఆయనను ఇతర నేతలు ఆదర్శంగా తీ’సుకోవాలని చెప్పిన సంగతి విధితమే.
బండి సంజయ్‌ను మార్చాలని రాష్ట్రానికి చెందిన కొం దరు వలస నేతలు చేస్తున్న ప్రయత్నాలకు అధినాయ కత్వం గండికొట్టడంతో వారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నట్లు సమాచారం. బండి సంజయ్ నాయకత్వంలో కచ్చి తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరు తుందని పార్టీ సీనియర్లు ఆయనతో సమన్వయం చేసుకుని ప్రజలకు చేరువై పనిచేయాలని కోరినట్లు సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన సందర్భంలోనూ బండి సంజయ్ పనితీరును మోడీతోపాటు పార్టీలోని ఇతర అగ్రనేతలు ప్రశంసించారు. తెలంగాణ ప్రజలను తన ప్రసంగాల ద్వారా సంజయ్ ఎంతో ఆకట్టుకుంటు న్నారని, గతంలో పనిచేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులకన్నా ఎంతో మిన్నగా సంజయ్ సేవలు అందిస్తున్నారని అమిత్ షా, నడ్డా మంగళవారంనాటి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు పార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ ప్రయత్నాలకు పార్టీ పెద్దలు అడ్డుకట్ట వేయడంతోపాటు భవిష్యత్‌లో బండి సంజయ్ నేతృ త్వంలోనే పార్టీ ముందుకువెళ్తుందన్న సంకేతాలు ఇచ్చారని సమాచారం.
వలసవాదుల అసంతృప్తులను చల్లార్చేందుకు వారం, పది రోజుల్లో వాళ్లలో కొంతమందికి జాతీయస్థాయిలో కీలక పదవులను కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలు స్తోంది. సంజయ్‌ను విభేదిస్తున్న పలువురు నేతలతో సమావేశమైన అమిత్ షా , నడ్డా వారి చెప్పినవన్నీ ఆలకించారని , అంతిమంగా సంజయ్ నాయకత్వానికే ఇద్దరూ అగ్రజులు జైకొట్టినట్లు సమాచారం. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఈ రెండేళ్లలో తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్న్యాయ శక్తిగా తయారు చేశారని, భారాసకు పోటీ ఇచ్చేది , ఢీకొట్టే పార్టీ బీజేపీనేన్న అం శాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సంజయ్ విజయం సాధించారని ఆ ఇరువురు పార్టీ పెద్దలు వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.