న్యూ ఢిల్లీ – బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో అన్నిఏర్పట్లు పూర్తి చేశారు.. దేశ రాజధానిలోని నేటి నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 37 రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, మరో 27 మంది సంఘటన్ మంత్రులు, మహా మంత్రులు, క్షేత్రీయ సంఘటన్ మంత్రులు పాల్గొంటారు. అలాగే 19 మంది మాజీ ముఖ్యమంత్రులు, 12 మంది మాజీ ఉప ముఖ్యమంత్రులు, 17మంది ఫ్లోర్ లీడర్లు, 168 మంది లోక్‌సభ, రాజ్యసభ చీఫ్ హెడ్లు, 182 ఇతర సభ్యులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు. మొత్తం 350 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం ఆ పార్టీ మొదటిరోజు భారీ రోడ్‌షోను నిర్వహించనుంది. నేటి మధ్యాహ్నం గంటలకు 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ రోడ్ షో సర్దార్ పటేల్ చౌక్ మీదుగా ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వరకూ సాగనుంది.
దాదాపు ఒక కిలో మీటర్ మేర జరగనున్న ఈ రోడ్‌షోలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. రెండు రోజులు పాటు జరిగే ఈ బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో మొత్తం 6 అంశాలపై ప్రజెంటేషన్ జరుగుతుంది. సేవా, సంఘటన్, సమర్పణ్, విశ్వగురు భారత్, సుశాసన్ సర్వ ప్రథమ్ , సమావేశ్, సశక్త్ భారత్, సంస్కృతి సంవాహ్, ప్రతి పక్షం హోదాలో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ఎజెండాలో అంశాలు వంటివి చర్చకు వస్తాయి. వీటితో పాటు దేశంలోని ప్రధాన సమస్యలు, రాజకీయ, సామాజిక సమస్యలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు రానున్న 9 రాష్ట్రాల్లో ఎన్నికలపై చర్చ, లోక్‌సభ ప్రవాస్ యోజన, బూత్ సశక్తీకరణ్ వంటి వివిధ అంశాలపై చర్చ జరుగుతంది. ఈ అంశాలపై జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు..