భూకబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ పార్టీని వీడి బిజెపిలో జాయిన్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు హోరా హోరీగా సాగి ఆఖరికి తన పంతానే నెగ్గించుకుని బిజెపిని గెలిపించారు ఈటల. దాంతో టిఆర్ ఎస్ కి మింగుడుపడని విధంగా తయారయిన ఈటల.. టీఆర్ ఎస్ నేత కుమారై పెళ్ళిలో కనిపించి సందడి చేయడం ఆ పార్టీ సీఎం కేసీఆర్ కి షాక్ అనే చెప్పాలి. టిఆర్ ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి ఈటల వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పద్మారావు గౌడ్ ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్నారు.
అయితే తాజాగా సికింద్రాబాద్ లో ఆయన కూతురి వివాహం జరిగింది. ఈ వివాహానికి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ సహాపలువురు నేతలు హాజరయ్యారు. అయితే ఈ వివాహనికి ఈటల రావడం ప్రాధాన్యతని సంతరించుకుంది.