Friday, November 22, 2024

BJP Election Plan – తెలంగాణలో మోడీ కృష్ణాస్ర్తం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో మాదిగ సామాజికవర్గ బలాన్ని భాజపా సరైన సమయంలో సరిగ్గానే గుర్తించింది! తెలం గాణలో మాదిగ సామాజికవర్గం మద్దతు లేకుండా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యంగా సంఘ్‌పరివార్‌ భాజపా అధిష్టానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హస్తిన నేతలు మరింత లోతుగా ఎమ్మార్పీఎస్‌ పోరాటం గురించి అధ్యయనం చేసి నట్టు చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా ఒకే సమస్య ఒకే జీవితం అన్నట్టుగా మంద కృష్ణ మాదిగ ఆధ్వ ర్యంలో జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకున్న నేతలు అచ్చెరువొందినట్టు రాష్ట్ర నాయకులు వివరిస్తున్నారు. దళిత సామాజికవర్గాన్ని మరింత ఆకట్టుకోవ డానికి ఇదే సరైన సమయమని భావించిన ప్రధాని మోడీ మహాసభలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. పరేడ్‌ గ్రౌండ్‌ సాక్షిగా వెల్లువెత్తిన జనసమూహాన్ని చూసి ప్రధాని ఫిదా అయినట్టు చెబుతున్నారు. ఎవరికి వారు సొంత ఖర్చులతో రావాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన ఒక్క పిలుపుతో లక్షలాది మంది తరలిరావడం మోడీని సైతం ఆకట్టుకుంది. అందుకే ఇక ఈ పోరాటం వద్దని, నేనున్నానని ఆయన భరోసానిచ్చారు. అయితే, తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది ఉన్న మాదిగలను ఆకట్టుకోవడం ద్వారా జరుగనున్న ఎన్నికల్లోనూ సత్తా చాటవచ్చునన్నది భాజపా వ్యూహంగా కనిపిస్తోంది.

ఒకే దెబ్బకు.. రెండు పిట్టలు..
బీసీల అభిమానంతో తెలంగాణాలో పాగా వేయాలని భావించిన బీజేపీకి సరికొత్త కులాస్త్రం ఎంపీఆర్‌ఎస్‌ తమ అంబుల పొదిలో చేరినట్టే. ఎస్సీ వర్గీకరణతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పునాది వేయటంతో పాటు తెలంగాణలో దళితబంధు పథకాన్ని దీటుగా ఎదుర్కొనవచ్చునన్నది మోడీ వ్యూ#హం. అందుకే లోక్‌సభ ఎన్నికల ముందే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రాణం పోసి.. ఇటు తెలంగాణ అసెంబ్లిd ఎన్నికల్లోనూ.. అటు పార్లమెంటు ఎన్నికల్లోనూ తిరుగులేని శక్తిగా బీజేపీని తీర్చిదిద్దాలని కమలనాధులు భావిస్తున్నట్టు పరిశీలకుల అంచనా. ఫిబ్రవరిలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి రెండు అంశాలు పరిశీలనలో ఉన్నాయి. నేరుగా వర్గీకరణ బిల్లు కోసం రాజ్యంగ సవరణ చేయడమా..? లేక రాష్ట్రాలకు రిజర్వేషన్‌ అధికారాలు ఇస్తూ పార్లమెంటులో చట్టం చేయడమా? అనే అంశంపై లోతైన పరిశీలన జరుగుతోంది. ఇక ఢిల్లిdకి చేరగానే ఎస్సీ వర్గీకరణాంశంపై న్యాయశాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర నివేదిక కోరినట్టు సమాచారం.

దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా మాదిగలు ఎస్సీ వర్గీకరణతో లబ్ధి పొందనున్నారు. విద్య, ఉద్యోగాల్లో తమ #హక్కును పొందుతారు. ఆదినుంచి అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికల సందర్భంగా హామీలు కుమ్మరించటం.. అనంతరం విస్మరించడం ఆనవాయితీగా మారింది. ఎన్నికల్లో పోటీ చేయటానికి జన బలం ఉన్నా.. ఆర్థిక స్థోమత లేకపోవటంతోనే… చట్ట సభల్లో స్థానం లభించటం లేదు. ఈ స్థితిలో ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడిగా మంద కృష్ణ ముప్పై ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. శనివారం పరేడ్‌ గ్రౌండ్‌లో మాదిగ విశ్వరూపాన్ని చూసిన ప్రధాని మోడీ చలించిపోయారు. ఇంత మహోజ్వల బలానికి తాము దూరమయ్యామా? అని ఆశ్చర్యపోయారు. మంద కృష్ణ నాయకత్వ పటిమను అర్థం చేసుకున్నారు. ఆయనను కమలనాథుడిగా ఆవిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. భళా! నీ పోరాటం అనన్యసామాన్యం. నీ ప్రతిభకు కొలమానం లేదు.. అంటూ ఆలింగనం చేసుకుని ప్రశంసలు కురిపించారు. బలమైన సామాజిక ఉద్యమకారుడిగా గౌరవించడం తమ విధిగా భావించారు. కేంద్రబలగాలతో రక్షణ కల్పించే అవకాశం కల్పించనున్నారు. అంతే కాదు.. బీజేపీ నుంచి రాజ్యసభకు పంపించే ఆలోచనలోనూ ఉన్నారని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు. మాదిగ సామాజిక ఓట్లు గంపగుత్తగా పొందే వ్యూ#హం ఓ వైపు,.. మనుధర్మశాస్త్రంతో దూరమైన అణగారిన వర్గాల దరి చేరడానికి ఇదే అవకాశంగా భాజపా భావిస్తోంది. ఇక అండగా ఉంటుందనే ఆలోచనను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లటంతో.. తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారనున్నదని పరిశీలకుల అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement