Friday, November 22, 2024

Red Lines | తెలంగాణ‌లో బీజేపీకి అంత సీన్‌లేదు.. కేసీఆర్ అతి తెలివి చూపొద్దు: నారాయ‌ణ‌

లెక్కలతో రాజకీయ జఖ్యత సాధ్యం కాదని, పరస్పర సహకారం అన్నింటికీ మించి అవగాహన ముఖ్యమని సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కే. నారాయణ తెలిపారు. జీజేపీకి వ్యతిరేకంగా పోరాడే క్రమంలోనే బిఆర్ఎస్ కు మద్దతు పలికామని, ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేసిఆరే దే అన్నారు. ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. సభకు లక్షకు పైగా తరలివచ్చారు. సభా ప్రాంగణమైన ప్రకాశం స్టేడియం జనంతో కిక్కిరిసి పోయింది. ఎటు చూసినా జనమే కనిపించారు. కొత్తగూడెం పురవీధులు అరుణ నిర్గాన్ని సంతరించుకున్నాయి. సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సభలో నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ వీరోచిత పాత్ర పోషించిందన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా అసలు తెలంగాణ ప్రాంతం దేశంలో ఉండేది కాదని, సిపిఐ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని నారాయణ అన్నారు. కేసిఆర్ తెలివిగల వాడే కానీ, అతి తెలివి ప్రదర్శస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దళితబందు తీరు ఊరికో కోటి, ఇంటికో ఈక మాదిరిగా మారిందని, దళితులకు మూడెకరాల భూమి సంగతి అసలే మర్చిపోయారన్నారు. 11 లక్షల ఎకరాలు పోడుభూములకు పట్టాలివ్వాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 4వేల ఎకరాలకే ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సిపిఐ ఎన్నికల కోసమే సభ ఏర్పాటు చేసిందని అంటున్నారని, ఎన్నికల్లోకి పోకుండా ఉండేందుకు తామేమి సన్యాసం తీసుకోలేవన్నారు. సీట్లు అడగడం తమ రాజకీయ హక్కని నారాయణ స్పష్టం చేశారు. బీజేపీ విధానాలు ప్రాంతానికో తీరుగా ఉంటాయని, బిజేపికి కట్టుబానిసగా ఉన్న జగన్ ను ఇప్పుడు ఎందుకు తిట్టిపోస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు. కర్నాటకలో సందుల్లో గొందుల్లో బిజేపీ నేతల తిరిగినప్పటికీ ఫలితం రాలేదని, ఇప్పుడు మోడి, అమీత్‌షా, నడ్డా తెలంగాణ చుట్టు తిరుగుతున్నారని, తెలంగాణలో బిజేపికి అంత సీన్ లేదన్నారు.

- Advertisement -

మోడీ రాష్ట్రపతిని పిలువకుండా ఎందుకు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారని, దానికి సహేతుకమైన కారణం చెప్పగలరా అని నూటి ప్రశ్న వేశారు. మోడి హాయంలో న్యాయవ్యవస్థ కుడా తన పరపతిని కోల్పోతుందన్నారు. సాంకేతిక పరంగా సిపిఐ జాతీయ హోదాను రద్దు చేశారని, ఎలక్షన్ కమీషనర్ నియామకమే చట్ట విరుద్దమన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాల్లో ఉన్న సిపిఐ జాతీయ హోదా రద్దు వెనుక పెద్ద దురుద్దేశ్యం ఉందన్నారు. తమ పోరాటాన్ని ఆపేందుకు ఎవ్వరు ప్రయత్నించినా ఫలితం ఉండదని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement