Monday, November 18, 2024

యూపీలో 17స్థానాల‌కు బిజెపి అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న – అప‌ర్ణాయాద‌వ్ కి ద‌క్క‌ని చోటు

యూపీ ఎల‌క్ష‌న్ నేప‌థ్యంలో 17స్థానాల‌కు బిజెపి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ల‌క్నో ప‌రిధిలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. కాగా ఈ లిస్ట్ లో ఎస్పీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ కోడ‌లు అప‌ర్ణాయాద‌వ్ ,
పార్టీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి పేరు లేక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అపర్ణ యాదవ్ లేదా మయాంక్ జోషిని లక్నో కంటోన్మెంట్ స్థానం బిజెపి రంగంలోకి దించుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇదే స్థానం నుంచి 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అప్ప‌టి స‌మాజ్ వాదీ పార్టీ అభ్య‌ర్థి అప‌ర్ణ యాద‌వ్ ను.. రీటా బ‌హుగుణ ఓడించ‌డం గ‌మ‌నార్హం. కాగా సుదీర్ఘ చర్చల అనంతరం మొత్తం తొమ్మిది లక్నో స్థానాలకు బిజెపి అభ్యర్థులను నేడు ప్రకటించింది. రాజధాని లక్నో నుండి హై ప్రొఫైల్ ఆశావహులు, సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ , బిజెపి ఎంపి రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి ఇద్దరూ జాబితాలో లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి.. మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ప్ర‌స్తుతం యూపీలో బిజెపి అధికార పార్టీగా ఉండ‌గా.. స‌మాజ్ వాదీ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదాలో ఉంది. ఈ సారి అధికారం చేప‌ట్టాల‌ని రెండు పార్టీలు తీవ్రంగా శ్ర‌హిస్తున్నాయి. అయితే ఇప్పుడు లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి లక్నో (సెంట్రల్) ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేష్ పాఠక్‌ ను బిజెపి పోటీకి దింపింది. కాగా స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ సరోజినీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మహిళా సంక్షేమ శాఖ సహాయ మంత్రి స్వాతి సింగ్ , ఆమె భర్త దయా శంకర్ సింగ్ ఈ సీటుపై దృష్టి సారించినట్లు వార్తలు వ‌చ్చాయి. మ‌రో మంత్రి అశుతోష్ టాండన్ లక్నో తూర్పు స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement