బిజెపి అభ్యర్థే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ..దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రధాని మోడీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానన్నారు. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని.. ప్రతిపక్షాలు వేరు వేరు కూటములుగా ఉండద్దని పాల్ సూచించారు. నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించిన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. బిజెపి అభ్యర్థి 60 శాతం ఓట్లతో గెలుస్తారు. నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. బిజెపి, కాంగ్రెస్ ల వల్ల దేశం నాశనం అయిపోతుంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బిజెపి బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకు ప్రతిపాదించాను.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోడీ, అమిత్ షా, పురుషోత్తం రూపాలకు తెలిపాను. నాతో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కూటమిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాలుగు కూటములుగా ఉన్నాయి. కేసీఆర్ తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించాను. కెసిఆర్ కి వచ్చే ఎన్నికల్లో ఎంపీలు ఉండరన్నారు.