దేశంలో కావాల్సినంత నీటి లభ్యత ఉన్నా వాటిని వాడుకునే తెలివి ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదని మండిప్డారు సీఎం కేసీఆర్. కనీస సోయిలేకుండా భారతంలోని శాంతి పర్వాన్ని కోట్ చేస్తూ.. బడ్జెట్లో అన్నీ అబద్ధాలు చెప్పారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని ప్రశ్నించారు.. నిర్మలమ్మా ఆ మాటలు చెబుతూ ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మీకు మనసెలా వచ్చింది.. ఎందుకు ఆత్మ వంచన చేసుకున్నారు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ దేశానికి పుట్టిన కుక్కమీతి పిందె బీజేపీ పార్టీ అని… ఈ సందర్భంగా కేసీఆర్ బీజేపీని, ప్రధాని మోడీని విమర్శించారు. పేదలకు ఎటువంటి ఉపయోగం లేని బడ్జెట్.. వేల కోట్లు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వారికి ఉపయోగపడేలా మేళ్లు చేయడానికి బడ్జెట్ ఉందన్నారు కేసీఆర్. ఇంత సిగ్గులేకుండా ఎట్లా బడ్జెట్ గొప్ప అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.