Tuesday, November 26, 2024

India: అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్టోలో పొరపాటు.. శశిథరూర్ తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం!

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్న ఆ పార్టీ సీనియర్​ నేత శశిథరూర్​ ఇప్పుడు బీజేపీకి టార్గెట్​గా​ మారారు. ఎందుకంటే.. శశిథరూర్​ ప్రకటించిన ఎన్నికల మేనేఫెస్టోలో భారత దేశ మ్యాప్​ని తప్పుగా ప్రచురించడమే దీనికి కారణంగా మారింది. వివాదంగా మారి, పొలిటికల్​ హీట్​ పెంచుతోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశి థరూర్ నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆయన బీజేపీకి సెంటర్​ పాయింట్​ అయ్యారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో దేశ పటాన్ని తప్పుగా చూపించడంతో వివాదం తలెత్తింది. శశి థరూర్‌ ఎన్నికల మేనిఫెస్టోలో భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపించడంతో భారతీయ జనతా పార్టీ ఆయనపై విరుచుకుపడింది. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ మ్యానిఫెస్టోలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు మినహాయించిన భారతదేశ మ్యాప్‌ను ఉంది. భారతదేశం మ్యాప్ తప్పుగా చూపించడం సంచలనంగా మారడంతో ఆ తర్వాత శశి థరూర్ కార్యాలయం తమ మ్యానిఫెస్టోలో కొన్ని సవరణలు చేసింది.

బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశి థరూర్ తన మ్యానిఫెస్టోలో భారతదేశ మ్యాప్‌ను మార్చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ దేశాన్ని ఎకం చేయాలన్న ఆలోచనలో ఉండగా, ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోటీ పడుతున్న వ్యక్తి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా ఇది గాంధీల ఆదరాభిమానాలను చూరగొనడానికి మంచి మార్గం అని భావించి ఉండవచ్చు” అని ఎద్దేవా చేశారు.

శశి థరూర్ నామినేషన్ దాఖలు.. కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి పార్టీ నేత శశిథరూర్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తిరువనంతపురం ఎంపీగా ఉన్న థరూర్​ తన నామినేషన్​ పత్రాలను పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు శశి థరూర్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement