Friday, November 22, 2024

వ‌ర్ర‌కుంట కబ్జా చేసిన గ్రేటర్‌ ఇన్‌ఫ్రా కార్యాల‌యం వ‌ద్ద బిఆర్ఎస్,బిజెపిలు ధ‌ర్నా

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారం ఇండస్ట్రీయల్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 82,83లో విస్తరించిన వర్రకుంట(రెవెన్యూ రికార్డుల ప్రకారం యెర్రకుంట) ను నామరూపం లేకుండా చేసి అందులో 86 విల్లాలను నిర్మిస్తుంది
ఓ భారీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ.. నిర్మించేది వందలాది కోట్లతో విల్లాలు.. కడుతున్నది మాత్రం వర్ర‌కుంటను ఖతంపెట్టి అప్పనంగా కాజేసిన భూమిలో. అయితే, ఇక్కడే ఓ మతలబు ఉంది. ఇంతటి గ్రేటర్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అస్సలు సర్వే నెంబర్‌ లేకుండానే కన్‌స్ట్రక్షన్‌ పర్మిషన్లు ఎట్లా ఇచ్చారన్నది ఇప్పుడు లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలింది. నిండుగా నీళ్లున్న చెరువును మొత్తానికే లేకుండా చేసి, దాని ప్లేసులో విల్లాల నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోవడం.. ఆ పై అక్కడ అస్సలు చెరువు (కుంట) లేదని రుజువులు క్రియేట్‌ చేయడంలో అతి తెలివికి పోయారు కబ్జాదారులు. అయితే.. ఇవేవీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ మాత్రం కండ్లు మూసుకుని ఆ స్థలానికి మార్ట్‌ గేజ్‌ చేసింది. ఇలా, తవ్విన కొద్దీ గ్రేటర్‌ ఇన్‌ఫ్రా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కబ్జాదారుల చిత్ర విచిత్ర విన్యాసాలపై ఆంధ్ర‌ప్ర‌భ వరుస క‌థ‌నాల‌తో స్థానికుల‌తో పాటు ,అధికార‌, విప‌క్ష నేత‌ల‌లో క‌ద‌లిక వ‌చ్చింది..ఈ కబ్జాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.. ఈ క‌బ్జారాయ‌ళ్ల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఇన్ఫ్రా ప్రాజెక్టు ముందు బిఆర్ఎస్,బిజెపిలు వేర్వేరుగా ధ‌ర్నాకు దిగాయి.. వ‌ర్ర‌కుంట‌ను మాయం చేసి విల్లాలు నిర్మిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌తో పాటు ఇప్ప‌టికే నిర్మించిన‌, నిర్మాణంలో ఉన్న క‌ట్ట‌డాల‌ను కూల్చివేయాల‌ని బిజెపి, బిఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేశారు.. వ‌ర్ర‌కుంట ప‌రీర‌క్ష‌ణ‌కు ఆందోళ‌న‌ను మ‌రింత ఉదృతం చేస్తామ‌ని ఈ రెండు పార్టీల నేత‌లు హెచ్చ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement