Friday, November 22, 2024

BJP – ఖ‌మ్మంలో ‘షా’ షోకి స‌ర్వం సిద్ధం..

ఖమ్మం గుమ్మంగా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలపై కమల దళం ప్రత్యేక దృష్టి పెట్టింది. చిరకాల ప్రత్యర్థులు కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మంలో పట్టు సాధించి అధికార బీఆర్‌ఎస్‌పైనా పైచేయి సాధించా లన్న వ్యూహాన్ని బీజేపీ పెద్దలు రచించారు. ఖమ్మం జిల్లాలో టీ-ఆర్‌ఎస్‌ బలహీనంగా ఉండడంతో అర్బన్‌ సీటు- మినహా మిగిలిన చోట్ల ఆధిక్యం అంతంత మాత్రంగానే కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులను మట్టికరిపించి నట్లే ఖమ్మంలోనూ చేయాలని బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి టార్గెట్‌ను విధించినట్లు తెలు స్తోంది. బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతల్లో ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకోవడం తోపాటు యువత, చదువుకున్న మేథావుల్లో బీజేపీ సిద్ధాంతాలకు ఆదరణ పెరిగేలా చేయడంతోపాటు రైతులు, అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై ఉద్యమించి వారి ఓట్ల సాయంతో జిల్లాలో ప్రభావం చూపాలని భావిస్తోంది.

తుమ్మల కోసం ముమ్మర ప్రయత్నాలు…
అధికార బీఆర్‌ఎస్‌ అసంతృప్త ముఖ్యనేతలను చేర్చుకోవాలన్న వ్యూహంలో భాగంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావును పార్టీలోకి చేర్చుకుని ఎన్నికల ముంగి ట కాంగ్రెస్‌, అధికార బీఆర్‌ఎస్‌లకు షాక్‌ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకు నేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. చివరి నిమిషంలో పొంగులేటి కాంగ్రెస్‌ కండువా కప్పుకు న్నారు. ప్రస్తుతం మరోసారి పొంగులేటి తరహా పరిస్థితులు పునరా వృతం కాకుండా తుమ్మలకు పక్కాగా బీజేపీ కండువా కప్పేందుకు ఆ పార్టీ అధిష్టానం పకడ్బం ధీ వ్యూహరచన చేసి నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేం దర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే తుమ్మ ల, జలగంలతో రెండు, మూడు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేత అమిత్‌ షా తుమ్మలతో నేరుగా మాట్లాడి బీజేపీలోకి ఆహ్వానించారు.

బీజేపీలో చేరితే ఖమ్మం జిల్లా మొత్తం తుమ్మల చేతిలో పెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ఆదేశాలతో ఈటల, కిషన్‌రెడ్డి కూడా రంగం లోకి దిగినట్లు తెలిసింది. మరోవైపు తుమ్మలకు గరిక పాటి మోహన్‌రావు దగ్గరి బంధువు కావడంతో అటు వైపు నుంచి తుమ్మలతో చర్చలను ముమ్మరంగా సాగిస్తోన్నట్లు సమాచారం. బీజేపీలో చేరితే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెద్దన్న పాత్ర ఇవ్వడంతోపాటు పార్టీ జాతీయ నాయకత్వంలోనూ కీలక పదవి ఇచ్చేం దుకు అధిష్టానం సిద్ధంగా ఉందని గరికపాటి తుమ్మల కు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే తుమ్మల బీజేపీలో చేరేది లేనిది స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఖమ్మం నుంచే అసెంబ్లి ఎన్నికల శంఖారావం
ఇక యువత, చదువుకున్న మేథావులతోపాటు జిల్లాలోని రైతులు, అసంఘటితరంగ కార్మికుల్లో బీజేపీపై ఆదరణను పెంచుకునేందుకు కాషాయపార్టీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అమిత్‌ షా పాల్గొనే బహిరంగ సభకు ”రైతుల గోస – బీజేపీ భరోసా” అని పేరు పెట్టారు. ఈ సభ నుంచే అమిత్‌ షా అసెంబ్లిd ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

- Advertisement -

అమిత్‌ షా పర్యటన షెడ్యూలిదే!
అసెంబ్లి ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో అమిత్‌ షా తెలంగాణ టూర్‌ ఖరారైంది. ఆగస్టు 27వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఖమ్మం వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అమిత్‌ షా ఈ నెల 27న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 2 గంటల 10 నిమిషాలకు కొత్తగూడెం కు వస్తారు. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు. 2.25 గంటల నుంచి 2.40 గంటల వరకు భద్రాద్రి రాములోరి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొత్తగూడెం నుంచి 2.55 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఆ తర్వాత… ‘రైతు గోస- బీజేపీ భరోసా’లో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత. తిరిగి గన్నవరం విమానా శ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement