Friday, November 22, 2024

Biz: స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట.. 900పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: వరుసగా రెండు రోజుల అనంతరం స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీగా లాభాలను నమోదు చేసింది. సెన్సెక్స్‌ 886పాయింట్లు (1.56శాతం) పెరిగడంతో 57000 మార్కును అధిగమించింది. ఐటీ, ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో సూచీలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ సానుకూల సంకేతాలు సూచీలకు అండగా నిలిచాయి. ఐరోపా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నా ప్రమాదంలేదని విశ్లేషకుల అభిప్రాయం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. మరోవైపు నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఫలితాల్లో రేట్ల పెంపు ఉండదనే వార్తలు కూడా మార్కెట్‌కు ఊతమివ్వడంతో సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్‌ మంగళవారం 57,125.98 పాయింట్ల వద్ద ప్రారంభమై 57,905.63పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 56,992.27 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 17,044.10పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,251.65పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 16.987.75పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

చివరకు సెన్సెక్స్‌ 886.51(1.56శాతం) పాయింట్లు లాభపడి 57,633పాయింట్ల వద్ద, నిఫ్టీ 264.45(1.56శాతం) పాయింట్లు పెరిగి 17,176.70పాయింట్ల వద్ద ముగిసింది. టాప్‌ గెయినర్స్‌ జాబితాలో హిండాల్కో, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌ జాబితాలో సిప్లా, బ్రిటానియా, దివిస్‌ ల్యాబ్స్‌, ఐవోసీ, ఏషియన్‌ పేయింట్స్‌ ఉన్నాయి. సెన్సెక్స్‌ 30స్టాక్స్‌లో ఏషియన్‌ పేయింట్స్‌ మినహా అన్ని షేర్లు లాభపడ్డాయి. 15శాతానికిపైగా లాభపడిన స్టాక్స్‌లో డీఎంఆర్‌ హైడ్రో ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ (25శాతం), హైటెక్‌ కార్పొరేషన్‌ (20శాతం), ఆర్‌ఎసీఎల్‌ గేర్‌ టెక్‌ (20శాతం), రాంకీ ఇన్ఫ్రా (19.99శాతం), మోడీసన్‌ మెటల్స్‌ (19.98శాతం), రాజ్‌దర్శన్‌ ఇండ్‌ (19.97శాతం), సూరజ్‌ లిమిటెడ్‌ (19.95శాతం), అన్సాట్‌ హౌసింగ్‌ (19.92శాతం), యూటిక్‌ ఎంటర్‌ప్రైజస్‌ (19.88శాతం), సార్థక్‌ మెటల్స్‌ (19.87శాతం) లాభాలను నమోదు చేశాయి.

పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
మంగళవారం సెన్సెక్స్‌ ఒక సమయంలో 1000పాయింట్ల వరకు లాభపడగా ఆ సమయంలో ఇన్వెస్టర్ల సంపద రూ.3.33లక్షల కోట్లు పెరిగింది. కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లు భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30స్టాక్స్‌లో 28స్టాక్స్‌ లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, మెటల్‌ సూచీలు 2శాతం లాభాన్ని అందుకున్నాయి. ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. మరోవైపు నష్టాలను చవిచూసిన స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పేయింట్స్‌ ఉన్నాయి. వరుసగా రెండు రోజులు సూచీలు భారీగా నష్టపోయాయి. సోమవారం సెన్సెక్స్‌, నిఫ్టీ 1.5శాతం క్షీణించడంతో దాదాపు మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. అయితే మంగళవారం మళ్లిd లాభాల బాట పట్టాయి. డాలర్‌ మారకంతో రూపాయి విలువ 10పైసలు పెరిగి 75.36వద్ద ట్రేడ్‌ అయింది. క్రూడ్‌ ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement