న్యూఢిల్లీ : కొంతమందికి పెంపుడు జంతువులు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. తమ కుటుంబంలో ఓ సభ్యుడిలా చూసేవాళ్లు కూడా ఉంటారు. బర్త్ డే పార్టీలు కూడా చేస్తుంటారు. అది మన నుంచి భౌతికంగా విడిపోతే.. సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు కూడా చేస్తారు. మధ్యప్రదేశ్ జబల్‌పూర్ జిల్లా రాంఝీ మనేగావ్‌కు చెందిన అమన్ సింగ్ చౌహాన్‌కు చెందిన రామ చిలుక తప్పిపోయింది.
తన చిలుకను తీసుకొచ్చి ఇస్తే.. రూ.15వేలు బహుమతి ఇస్తానని ప్రకటించడం విశేషం. దీని కోసం చౌహాన్ ఏకంగా కరపత్రాలు ముద్రించి పంచుతుండటం విశేషం. అయితే ఆ చిలుక పేరు బిట్టు అని, రెండేళ్లుగా తన వద్దే ఉందని, 2వ తేదీన పంజరం తలుపు తెరుచుకుని ఎగిరిపోయిందని చౌహాన్ వివరించాడు. ఎంత ప్రయత్నించినా దొరకలేదని, వార్తా పత్రికలో కూడా ప్రకటన ఇచ్చినట్టు తెలిపాడు. బిట్టును తీసుకొస్తే.. రూ.15వేల బహుమతి ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా తన బిట్టు తన వద్దకు చేరుతుందనే నమ్మకంతో చౌహాన్ ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital