Tuesday, November 26, 2024

కేరళ నన్‌పై అత్యాచారం కేసు.. బిషప్ ఫ్రాంకో ములక్కల్ కు ఊరట.. నిర్దోషిగా తేల్చిన కోర్టు

కేరళ నన్ పై అత్యాచారం కేసుకు సంబంధించి బిషప్ ఫ్రాంకో ములక్కల్ కు ఊరట లభించింది. ఈ మేరకు కోర్టు ఆయనను నిర్ధోశిగా తీర్పునిచ్చింది. 2014 నుంచి 2016 మధ్యకాలంలో పలుమార్లు క్రిష్టియన్ నన్ (సన్యాసిని)పై రేప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళలోని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నన్ ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసులో అరెస్టయిన వారిలో దేశంలోనే మొదటి వ్యక్తి క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్.

కాగా, ఈ కేసులో ఫ్రాంకో ములక్కల్ పోలీసులకు, కోర్టుకు సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఫ్రాంకో ములక్కల్‌పై అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, బలవంతపు నిర్బంధానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. 100 రోజులకు పైగా సాగిన విచారణ తర్వాత కొట్టాయంలోని కోర్టు అతనిని అన్ని అభియోగాల నుండి విముక్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement