Thursday, November 21, 2024

స‌మోసాలో బిర్యానీ.. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్

స‌మోసా బిర్యానీని క‌లిపి తిన్నారా.. ఇక్క‌డ ఈ క్రేజీ కాంబినేష‌న్ వైర‌ల్ అవుతోంది. సమోసా తయారీలో… లోపల స్టప్ కింద చాలా పదార్థాలను వాడుతుంటారు. కొందరు ఆలూ కర్రీ ఉపయోగిస్తారు. మరి కొందరు ఉల్లిపాయ కర్రీ, కొందరు క్యారెన్స్, మరి కొందరు స్వీట్ కార్న్ ఇలా రకరకాల కర్రీలను లోపల స్టప్ గా పెట్టి తర్వాత సమోసాను నూనెలో వేయించుతారు. అయితే… ఆ స్టప్ కింద బిర్యానీని ఉపయోగించడం ఎప్పుడైనా విన్నారా. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఓ వ్యక్తి ఈ బిర్యానీ సమోసాను తయారు చేయగా.. ట్విట్టర్ లో వైరల్ అయ్యింది.ఈ పోస్ట్ ఇప్పటికే 186k పైగా వ్యూస్ రాగా… వేలల్లో కామెంట్స్ రావడం విశేషం. కొందరు ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉందని, చూడగానే టేస్టు చేయాలనే కోరిక కలుగుతోందంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి కొందరు మాత్రం… ఇలాంటి చెత్త ప్రయోగాలు చేసి జనాలను చంపకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement