Tuesday, November 19, 2024

శున‌కానికి బ‌ర్త్ డే – వంద కేజీల కేక్-ఐదు వేల మందికి భోజ‌నాలు

జంతువుల్లో అతి విశ్వాస‌మైనది శున‌కం..అందుకే ఎక్కువ‌గా చాలా ఇళ్ల‌లో శున‌కాన్ని పెంచుకుంటుంటారు.కాగా పెంపుడు జంతువులంటే వాటి య‌జ‌మానుల‌కి ఎన‌లేని ప్రేమ‌..అభిమానం. అయితే ఇక్క‌డో వ్య‌క్తి త‌న పెంపుడు శున‌కం కోసం భారీగా ఖ‌ర్చు చేయ‌డ‌మే కాదండోయ్..ఆ శున‌కాన్ని మంగ‌ళ‌వాయిద్యాల‌తో ఊరంతా ఊరేగించారు కూడా. ఈ కథకు పొలిటికల్ టచ్ కూడా ఉండడంతో ఊరు ఊరంతా పిలిచాడు. వంద కిలోల కేక్ కట్ చేశాడు. మందు లేదు కానీ.. మాంసంతో మంచి భోజనం వడ్డించాడు. అతిథులు కేక్ తిని భోజనాలు చేసి…ఆ కుక్కకు శుభాకాంక్షలు తెలిపారు.కర్ణాటకలో జరిగిన ఈ బర్త్ డే పార్టీ దాని వెనుక పొలిటికల్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… బెలగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి.. కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి ‘క్రిష్’ అని పేరు పెట్టుకున్నాడు. క్రిష్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. గ్రామంలోని దాదాపు 5 వేల మందిని పిలిచి మంచి భోజనం వడ్డించాడు.

పుట్టినరోజు వేడుకల్లో 100 కిలోల కేక్ కట్ చేయడమే కాదు.. 300 కిలోల మటన్, పెద్ద సంఖ్యలో గుడ్లను తెప్పించాడు. నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్.. వెజ్ తినే వారి కోసం ప్రత్యేకంగా కూరగాయలు తెప్పించి భోజన ఏర్పాట్లు చేశాడు. కేక్ కట్ చేసిన తర్వాత కుక్కను వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. గ్రామంలోని ప్రజలందరూ దానికి నమస్కరించారు. అయితే, క్రిష్ మీద శివప్ర మర్డికి ప్రేమ ఉన్నా.. ఈ పార్టీ వెనుక మాత్రం చిన్న పొలిటికల్ టచ్ కూడా ఉంది. అదేంటి అంటే.. శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. ఓసారి కొత్త పంచాయతీ సభ్యుడు ఒకరు తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడట. ఆ సందర్భంగా పాత పంచాయతీ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మా హయాంలో పాత పంచాయతీ సభ్యులు వచ్చి కుక్కల్లా తిన్నారని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడట. మాటలతో నొచ్చుకున్న శివప్ప మర్డి తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించి, ఐదు వేల మందిని పిలిచి… భోజనాలుపెట్టి ఔరా అనిపించారు. మొత్తంగా ఈ న్యూస్.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా త‌న‌ని కించ‌ప‌రిచిన వారికి ధీటుగా స‌మాధానం చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement