Thursday, November 21, 2024

Big Breaking: త్రిపుర సీఎం బిప్లవ్​దేవ్​ రాజీనామా.. బీజేపీ హైకమాండ్​ నిర్ణయంతోనే!

బీజేపీ హైకమాండ్​ నిర్ణయాలతో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు.  అన్నింటికంటే పార్టీ ఉన్నతమైనదనితాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు బిప్లవ్​దేవ్​..  ప్రధాని మోదీ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేశానని, పార్టీ రాష్ట్ర శాఖ అధినేతగా, ముఖ్యమంత్రిగా త్రిపుర ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు. అన్ని విధాలా ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించానని, శాంతి, అభివృద్ధి, కొవిడ్ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించండి అని రాజీనామా తర్వాత బిప్లబ్ కుమార్ దేబ్ అన్నారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రతిదానికీ టైమ్ ఫ్రేమ్ ఉంటుంది.. ఆ టైమ్ ఫ్రేమ్‌లో పని చేస్తాం.. నన్ను ఎక్కడికి పంపినా.. సీఎం లేదా మరేదైనా.. బిప్లబ్ దేబ్ అన్ని చోట్లా సరిపోతాడు అని వ్యాఖ్యానించారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బిప్లబ్ కుమార్ దేబ్ భేటీ అయిన మరుసటి రోజు ఈ పరిణామం జరిగింది. అయితే బిజెపి అధినాయకత్వం నుండి ఈ నిర్ణయం వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఇవ్వాల సాయంత్రం బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో కొత్త సీఎంని ఎన్నుకోనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పరిశీలకులుగా నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement