Tuesday, November 26, 2024

బిపిన్ రావ‌త్ దంప‌తుల‌కు నివాళుల‌ర్పిస్తున్న ప్ర‌ముఖులు .. అంజ‌లి ఘ‌టించిన కుమారైలు

సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ , ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్ లు హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. కాగా వారి పార్థివ‌దేహాల‌కు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పిస్తున్నారు. కాగా రావ‌త్ దంప‌తుల భౌతిక‌కాయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళుల‌ర్పించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ , మల్లికార్లున ఖర్గే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు.

వారితో పాటు రావత్ కుమారైలు క్రితిక‌, త‌రిణి కూడా త‌ల్లిదండ్రుల భౌతిక‌కాయాల‌కు నివాళుల‌ర్పించి , అంజ‌లి ఘ‌టించారు. వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా రావత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రావత్‌ దంపతులఅంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ అంతిమ యాత్ర‌.. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్​లోని స్మశాన వాటిక వరకు సాగుతోంది. సైనిక లాంఛనాలతో బిపిన్‌రావత్‌ దంపతుల అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రావ‌త్ అంతక్రియ‌ల‌కు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులుహాజరు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement