Wednesday, November 20, 2024

ముగిసిన బిపిన్ రావ‌త్ దంప‌తుల అంత్య‌క్రియ‌లు : నివాళుల‌ర్పించిన సైనికాధికారులు

బ్రార్ స్వ్కేర్ శ్మ‌శాన‌వాటిక‌లో సైనిక లాంఛ‌నాల‌తో బిపిన్ రావ‌త్ దంప‌తుల అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. కాగా రావ‌త్ అంత్య‌క్రియ‌ల్లో 800మంది సైనికులు పాల్గొన్నారు. ఈ అంత్య‌క్రియ‌ల్లో 17తుపాకుల‌తో బిపిన్ రావ‌త్ కు వంద‌నాన్ని చేశారు. బిపిన్ రావ‌త్ అత‌డే ఒక‌సైన్యం. అన‌న్య సామాన్యుడు .. అతి సామాన్య జీవితం ఆయ‌న‌ది. ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచింది బిపిన్ రావ‌త్ జీవితం. డ్యూటీలోనే తుదిశ్వాస విడిచారు బిపిన్ రావ‌త్. భార‌త‌దేశ తొలి సీడీఎస్ గా చ‌రిత్ర‌ని సృష్టించారు. స్సెష‌ల్ టాస్క్ లు స‌క్సెస్ చేయ‌డంలో ఆయ‌న మ‌హాదిట్ట‌. భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ‌కు యావ‌త్ జాతి నివాళిని అర్పించింది. విదేశీ సైనికాధికారులు కూడా సీడీఎస్ బిపిన్ రావత్ తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.

నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలకు సంబంధించిన సైనికాధికారులు బిపిన్ రావత్ కు నివాళులు అర్పించారు. వీరితో పాటు ప్రాన్స్, బ్రిటన్, శ్రీలంక దేశాలకు చెందిన విదేశాంగ శాఖ ప్రతినిధులు బిపిన్ రావత్ కు నివాళులు అర్పించారు.బిపిన్ రావత్ కు నివాళులు అర్పించిన వారిలో జనరల్ శవేంద్ర సిల్వా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు శ్రీలంక ఆర్మీ కమాండర్ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి విజేగుణరత్నే (రిటైర్డ్), శ్రీలంక మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు. రాయల్ భూటాన్ ఆర్మీ నుంచి డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ బ్రిగేడియర్ దోర్జీ రించెన్, నేపాల్ ఆర్మీ నుంచి లెఫ్టినెంట్ జనరల్ బాల్ కృష్ణ కర్కి, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ సుప్రోబల్ జనసేవశ్రీ, బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ లు బిపిన్ రావత్ కు నివాళులు అర్పించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement