Friday, November 22, 2024

Biparjoy effect | నెమ్మదించిన నైరుతి రుతపవనాలు.. వర్షాలు మరింత ఆలస్యం

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ బిపార్జోయ్ తుపాను ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంది. దీంతో జూన్ 18వ తేదీ వరకు కేరళకు ఎలాంటి వర్ష సూచన లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 8న కేరళకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బలహీన దశలో ఉన్నాయి. మాన్​సూన్​ సీజన్​ ప్రారంభమైన వారం తర్వాత కేరళలో నైరుతి రుతుపవనాలు 55 శాతం లోటుగా ఉన్నాయి. ఈ సీజన్​లో ఇప్పటికే కేరళలో 280.5 మిల్లీమీటర్ల వర్షపాతం అంచనా వేయగా, ప్రస్తుతం126 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక.. తొడుపుజ (ఇడుక్కి జిల్లా), పశ్చిమ కల్లాడ (కొల్లాం జిల్లా), కన్నూర్ విమానాశ్రయం ప్రాంతాల్లో 4 సెం.మీ., అలప్పుజ, సియల్ కొచ్చి (ఎర్నాకులం జిల్లా), కాయంకుళం, మావేలికర, హరిపాడ్ (అన్నీ అలప్పుజా జిల్లాలో), ఎర్నాకులం సౌత్, పెరుంబవూరు (ఎర్నాకులం జిల్లా), అంగడిపురం. పెరింతలమన్నా (రెండూ మలప్పురం జిల్లాలో), కలమస్సేరి.. ఒడక్కలి (రెండూ ఎర్నాకులం జిల్లాలో), మునక్కల్ (త్రిసూర్ జిల్లా), తవనూరు (మలప్పురం జిల్లా), తొడుపుజా (ఇడుక్కి జిల్లా), మట్టన్నూరు (కన్నూరు జిల్లా)లలో మంగళవారం3 సెం.మీ. వర్షపాతం మాత్రమే నమోదైనట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement