హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెన్ సంస్థ కరోనా టీకాలను ఉత్పతి చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ పరిశోధనలతో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్ ఈ.లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రాయల్స్ కు సిద్ధమైంది. టీకా మొదటి, రెండో దశ ప్రయోగాలు పూర్తిగా కావడంతో తాజాగా మూడో దశ ప్రయోగాలను సిద్ధమవుతోంది. తొలి రెండు దశ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని సంస్థ ప్రకటించింది. మూడో దశ క్లినకల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి అనుమతి వచ్చినట్లు తెలిపింది.
అమెరికాకు చెందిన డైనావాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ తో కలిసి హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ.లిమిటెడ్ క్లినకల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోవడం సంతోషంగా ఉందని బయోలాజికల్ ఈ.లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా డాట్ల అన్నారు. ప్రయోగాల్లో భాగంగా 2020 నవంబర్ లో 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గత 360 మంది వాలంటీర్లపై టీకాను ప్రయోగించనట్లు తెలిపారు. వీరికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల వ్యాక్సిన్ ను ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధక స్థాయిలను విశ్లేషించినట్లు వెల్లడించారు. ప్రజలకు సురక్షితమైన, సమర్థమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
కాగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా, ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ టీకా కొవిషీల్డ్ ను సీరమ్ భారత్ లో ఉత్పత్తి చేస్తోంది. భారత్ లో తయారైన వ్యాక్సిన్లను దేశీయంగా వినియోగించడమే కాకుండా, కేంద్రం ఇతర దేశాలకు కూడా అందిస్తోంది. దేశంలో కేసులు లక్షల్లో పెరగడంతో టీకాల ఉత్పత్తిని మరింత ముమ్మరం చేయాలని కరోనా వ్యాక్సిన్ ప్రధాన ఉత్పత్తిదారులైన సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరింది.