Saturday, November 23, 2024

Karteekam: శుభప్రదాయని, ఫలదాయని బిల్వ పత్రం.. శివుడికి అత్యంత ప్రీతిక‌రం!

సనాతన ధర్మంలో కొన్ని వృక్షాలను దేవతా వృక్షాలుగా పేర్కొన్నారు. అటువంటి వాటిలో మారేడు వృక్షం ముఖ్యమైనది. మారేడు వృక్షాన్ని సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు. బిల్వవృక్షం శివునికి అత్యంత ప్రీతి కరమైనది. ”మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు” అని కవితాత్మ కంగా తన హృదయాన్ని ఆవిష్కరిస్తారు వేటూరి సుందరరామమూర్తి.
పేరులోనే మారేడుకు ఓ ప్రత్యేకత ఉంది. రాజుకి వికృతి రేడు. మహారాజు అన్నీ ఇవ్వగలడు. మారేడు కూడా అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు మారేడు చెట్టు రూపంలో ఉన్నాడంటారు పెద్దలు. అంతటి విశిష్టమైనది మారేడు. లక్ష్మీదేవి కుడిచేత్తో మారేడు చెట్టును సృష్టించిందని చెబుతారు. అందుకే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షమనీ, మారేడు కాయను శ్రీఫలం అని కూడా అంటారు.

మారేడు చెట్టు పూవు పూయకుండానే కాయను కాస్తుంది. ఇది మారేడు చెట్టుకి సృష్టి యిచ్చిన గొప్పదనంతో కూడిన ప్రత్యేకత.
జీవితంలో మనం ఏది చేయగలిగినా, ఏదీ చేయలేక పోతున్నా, ఏదీ చేత కా కపోయినా, జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికీ, కర్మల జన్మల వాసనా బలా లను ఆపుకోలేక నప్పుడు, పాప కర్మలను మనంతట మనం నిగ్రహించుకోలేనప్పుడు, మనసుని ఈశ్వరాభిముఖం చేసుకోవాలి. దీనికి శాస్త్రాలలో మూడు విషయాలు చెప్పబడ్డాయి. విభూతి ధారణం, రుద్రాక్షలను మెడలో వేసుకోవటం, మారేడు దళాలతో శివలింగాన్ని జీవితంలో ఒక్కసారైనా అర్చన చేయటం ఈ మూడు విషయాలు. ఈ మూడింటినీ జీవితంలో తప్పక చేయాలని పెద్దలు చెబుతారు.

”బిల్వమూలే దీపమలాం య: కల్పయతి సాదరమ్‌!
స తత్త్వ జ్ఞానసంపన్నో మహశాంతర్గతో భవేత్‌!!” మారేడు వృక్షం మొదలున వరుసగా దీపాలను ఎవరైతే పెడతారో, అతడు తత్త్వ జ్ఞానాన్ని పొంది సాక్షాృత్తూ ఈశ్వరునిలో కలిసిపోతాడని శివపురాణం చెబుతోంది.
”బిల్వశాఖాం సమాదాయ హస్తేన నవ పల్లవమ్‌!

గృహత్వా పూజయేద్బిల్వం సచ పాపై: ప్రముచ్యతే!!” మారేడు చెట్టు కొమ్మల కు ఉన్న లేలేత మారేడు చిగురులు పట్టుకుని, భక్తితో పూజ చేస్తాడో, ఆ భక్తుడు సకల పాపాల నుంచి విముక్తుడవుతాడనీ శివపురాణం చెబుతోంది.
”త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం!

- Advertisement -

త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!” ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజించే భక్తుడు సత్వ, రజ, తమో గుణాలకు అతీతుడు అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మారేడు దళం నేరుగా శివలింగం మీద బోర్లా పడిన్లటతే జ్ఞానం సిద్ధిస్తుంది. మారేడు దళాలకు అంతటి శక్తి ఉంది కాబట్టే ”అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణ” అని శ్రీసూక్తం చెబుతోంది. అంటే అలక్ష్మిని (దరిద్రమును) పోగొ ట్టెదవు)నని భావం.

మారేడు వృక్షం సాక్షాత్తూ పరమేశ్వరుని స్వరూపంగా భావిస్తారు. మారేడు వృక్ష మ#హమ చెప్పడం చాలా కష్టమని శివపురాణం చెబుతుంది. మారేడు చెట్టు క్రింద లింగ రూపంలో ఉండే పరమేశ్వరుడ్ని పూజించే భక్తు డు, అనంతమైన పుణ్యాన్ని పొంది శివ సాన్నిధ్యాన్ని పొందుతాడని చెబుతారు. ప్రసిద్ధ తీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు మూలంలో నివసించి ఉం టాయంటారు. అవస్థలలో నాలుగవది ‘తురీయావస్థ’ అనే జ్ఞానావస్థ. శివలిం గాన్ని మారేడు దళాలతో పూజ చేసిన వారికి తురీయంలోకి వెళ్లగలిగే స్థితి వస్తుం ది. లక్ష్మీ నివాస స్థానాలలో మారేడు ఒకటని శాస్త్రాలు చెబుతున్నాయి.

మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వానికి ఉండే ఈనె శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షిస్తుంది. ఇంటిలో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యో గాలు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్న్టటతే, మూడు ఆకులు ఉన్న దళా లను పట్టుకుని శివునికి పూజలు చేస్తారు. ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజచేసిన వెంటనే శివుడు ”త్రియాయు షం” అని అంటాడట. బాల్యం, యవ్వనం, కౌమారం యీ మూడూ నీకు కలుగు తాయనీ శివుడు ఆశీర్వదిస్తాడని పెద్దలు చెబుతారు. బాల్య యవ్వన కౌమారం కలగడమంటే పూర్తి ఆయుర్దాయం కలగడమే కదా!

మారేడు చెట్టు మొదట్లో స్నానం చేసిన వాడు సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడని, అలా చేసినవారు మాత్రమే నిజమైన పవిత్రుల వుతారని శివపురాణం చెబుతోంది. బిల్వవృక్ష పరిసరాల్లో నివసించే వారికి కాశీక్షేత్రంలో నివసించిన ఫలితం వస్తుందంటారు. మారేడు చెట్టు మూలం కట్టినటువంటి కుదురు బ్ర#హ్మ శ్రేష్టం. ఆ కుదురుని నీటితో తడిపిన్టటతే ఈశ్వరుడు ఎంతో ఆనందిస్తాడట. మారేడు చెట్టు మూలా న్ని గంధం, పుష్పం మొదలైన ద్రవ్యాల సమర్పణతో పూజ చేసిన భక్తుడు అంత్య స్థితిలో శివసాయిజ్యాన్ని పొందుతాడు. ఆ భక్తుని సంతానం కూడా సుఖాన్ని శాం తిని పొందుతారు.

మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్లమంది దేవతలకు ప్రదక్షిణం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది. మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి న్లటతే, అతనికి అనంతమైన అపారమైన సిద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబు తున్నాయి. మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి, ఆవుపేడతో అలికి, పీటవేసి ఓ యోగ్యమైన వ్యక్తికి భోజనం పెట్టిన్లటతే, కోటి మందికి ఏక కాలంలో వంటచేసి అన్నం పెట్టిన ఫలితం వస్తుందంటారు. మారేడు చెట్టు క్రింద, పాలు నేతితో కూడిన అన్నాన్ని ఏ శివభక్తుడికైనా పెట్టిన్లటతే, పెట్టిన వ్యక్తి వచ్చే జన్మలో ఐశ్వ ర్యం పొందుతాడని పెద్దలు చెబుతారు. బిల్వ దళంలో తేనె వేసి ప్రతి శుక్రవారం తులసికోట దగ్గర పెడితే ధనానికి లోటు ఉండదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేసి ప్రయాణానికి బయలుదేరితే ఆర్ధికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

సాధారణంగా పుష్పాల తొడిమిని తీసి దేవునికి పూజ చేస్తారు. అయితే మారే డు దళాలతో పరమశివుని పూజ చేసేటప్పుడు ఈనెలను తీయవలసిన అవసరం లేదు. ఈనెలను పట్టుకునే శివార్చన చేస్తారు. దళాలను దళాలుగానే పూజ చేస్తా రు. బిల్వ దళాలు సాధారణంగా మూడు ఆకులుగా ఉంటాయి. అయితే అరుణా చలంలో మూడు, తొమ్మిది ఆకులతో ఉన్న బిల్వ దళాలు ఉంటాయి. మారేడు కాయకు చిన్న రంధ్రం చేసి, గుజ్జును తీసివేసి, బాగా ఎండబెట్టి అందులో విభూతిని నిల్వ చేసుకుంటారు.

ఆరోగ్యశాస్త్ర పరంగా పరిశీలిస్తే బిల్వ వృక్షం మిగిలిన వృక్షాల కంటే నాలుగు రెట్లు ప్రాణవాయువును విడుదల చేస్తుం ది. మారేడుచెట్టు నుంచి వచ్చే గాలి ప్రయోజనకరమైనది. మారేడు వృక్షానికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉంది. ఎన్నో ఔషధాలలో మారేడును ఉపయో గిస్తారు. విశేష శుభదాయిని, ఫలదాయిని అయిన బిల్వ వృక్షాన్ని ప్రతిచోటా, గృ హంలో, ఖాళీ స్థలంలో విరివిగా పెంచుకోవచ్చును.

Advertisement

తాజా వార్తలు

Advertisement