– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహదేవ్‌పురా నివాసి అయిన ఉదయ్‌కుమార్ హత్యకు గురయ్యాడు. నిన్న (గురువారం) అతని భార్య లవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసి మహదేవపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడు ఉదయ్ కుమార్ వృత్తిరీత్యా బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ప్రియ.. అన్వర్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. అన్వర్ తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీంతో తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని, తన భర్త ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటానని మదనపడింది. అన్వర్ పెళ్లి ప్రతిపాదనకు ప్రియా నో చెప్పింది. అయితే.. అన్వర్‌తో మాత్రం ఆ తరహా స్నేహం కొనసాగిస్తోంది.
ఇక.. తన భర్త రోజూ మద్యం తాగి తనను కొట్టేవాడని అన్వర్‌తో చెప్పుకుని విలపించేది. కాగా, గురువారం రాత్రి అన్వర్ ఉదయ్‌కు ఫోన్ చేసి భార్యపై దాడి చేయడంపై ప్రశ్నించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అన్వర్ ఉదయ్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. హత్య వెనుక ప్రియ పాత్ర ఉందని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.