బిహార్ పర్యాటక శాఖ మంత్రి నారాయణ్ ప్రసాద్ కుమారుడు బబ్లూ కుమార్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తన ఫామ్‌హౌజ్‌లో క్రికెట్ ఆడుతున్న చిన్న పిల్లలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆడుకుంటున్న పిల్లలను తరిమికొట్టేందుకు కాల్పులు జరిపారని ఆరోపిస్తూ బీహార్ మంత్రి కుమారుడిని గ్రామస్థులు కొట్టారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
బబ్లూ కుమార్ పిల్లలను భయపెట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని, దీంతో తొక్కిసలాట జరిగి ఒక చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ప్రసాద్ ఇంటికి చేరుకుని, ఆందోళన చేప్టటారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఫామ్‌హౌజ్‌లో ఉన్న మంత్రి కుమారుడుని చితకబాదారు. మంత్రి కుమారుడిని కొంతమంది వ్యక్తులు కొట్టినట్లు దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తుపాకీని కూడా లాక్కున్నారు.