Tuesday, November 26, 2024

గుజ‌రాత్ లో అతి పెద్ద డ్ర‌గ్స్ ర‌వాణా – రూ.500కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం

సుమారు రూ.500కోట్ల విలువైన డ్ర‌గ్స్ ని స్వాధీనం చేసుకుంది గుజ‌రాత్ యాంటీ టెర్ర‌రిస్ట్ స్వ్కాడ్. వ‌డోద‌ర న‌గ‌ర శివార్ల‌లోని ఓ ఫ్యాక్ట‌రీపై దాడి చేసింది. వడోదర సమీపంలోని చిన్న ఫ్యాక్టరీ-కమ్-గోడౌన్ వద్ద దాడి చేశామని, అక్కడి నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు ఓ ఏటీఎస్ అధికారి తెలిపారు. చట్టబద్ధంగా రసాయనాల తయారు చేస్తున్నామంటూ, ఆ ముసుగులో డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలను తయారు చేస్తున్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు.

ఈ ఏడాది ఆగస్టులో వడోదర నగరం సమీపంలోని ఓ గోదాం నుంచి దాదాపు రూ.1,000 కోట్ల విలువైన 200 కిలోల పార్టీ డ్రగ్ మెఫెడ్రోన్‌ను ఏటీఎస్ ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.ఈ సంవత్సరంలో గుజారాత్ ఏటీఎస్ తో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన సంయుక్తంగా నిర్వహించిన ఆరో ఆపరేషన్ ఇది. అంతకుముందు సెప్టెంబర్ 14న పాకిస్థాన్ బోటులో సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ పట్టుబడింది. రెండు నెలల వ్యవధిలోనే ఏటీఎస్, కోస్ట్ గార్డ్ ఈ రెండు విజయాలను సాధించాయి. 2021 అక్టోబర్ లో గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ లో 2,988 కిలోల హెరాయిన్‌ను ఏటీఎస్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంత‌ర్జాతీయ మార్కెట్ లో రూ. 21,000 కోట్లుగా అంచనా వేశారు. గుజరాత్ తీరానికి సమీపంలో జరిగిన అతిపెద్ద డ్రగ్స్ రవాణాలో ఇది ఒకటిగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement