Tuesday, November 26, 2024

ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ప‌క్కా..ఎవ‌రెవ‌రో తెలుసా..

బిగ్ బాస్5 హౌస్ లో ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది మంది కంటెస్టెంట్లు మిగిలారు. వారిలో ర‌వి మిన‌హాయించి మిగ‌తావారంతా నామినేష‌న్ లో ఉన్నారు. ఈ వారం కాజల్ కానీ యానీ మాస్టర్ కానీ ఎలిమినేట్ అవుతుందనే వార్తలు వినిపించాయి. వీరిద్దరికీ ఓట్లు తక్కువ వచ్చాయని టాక్. ఇదిలా ఉండగా.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి షాకివ్వబోతున్నారట‌. ఈ వారంలో హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వబోతున్నారట. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని పక్కా స‌మాచారం. ఈ డబుల్ ఎలిమినేషన్ లో సిరి, కాజల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి కాజల్ లాస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ కావాల్సింది కానీ జెస్సీ అనారోగ్యంగా కారణంగా హౌస్ నుంచి వెళ్లాల్సి రావడంతో కాజల్ సేవ్ అయింది. ఇక ఈ వారం ఆమె ఎలిమినేట్ కాక తప్పేలా లేదు. అయితే కాజల్ తో పాటు సిరి కూడా ఎలిమినేట్ అవుతుందని టాక్.

మొదటినుంచి సిరి తన గేమ్ చాలా బాగా ఆడుతుంది. షణ్ముఖ్-సిరి-జెస్సీల ఫ్రెండ్షిప్ కి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సిరి-షణ్ముఖ్ ల బిహేవియర్ ప్రేక్షకులకు నచ్చడం లేదు. సిరి అలగడం, షణ్ముఖ్ సారీ చెప్పడం.. షణ్ముఖ్ కోప్పడ్డాడని సిరి బాత్రూంలోకి వెళ్లి గోడకి తలబాదుకోవడం ఇలా చాలానే జరిగాయి. ఇవి కాకుండా.. ఇద్దరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయామని చెబుతూ నెగెటివ్ ఇంప్రెషన్ కలిగేలా మాట్లాడుతున్నారు. షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో అతడికి ఓట్లు బాగానే పడుతున్నాయి. సిరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ.. ఆమె ప్రవర్తన కారణంగా ఓటింగ్ రేట్ తగ్గినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారట. మరి సిరి వెళ్లిపోతే షణ్ముఖ్ ప‌రిస్థితి ఏంటీ. హౌస్ లో ఎంట‌ర్ టైన్ మెంట్ మిస్స‌వుతుందేమోన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement