గతేడాది ప్రపంచవ్యాప్తంగా మృత్యువు విలయ తాండవం చేసింది. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రాణాలు కబళించేయగా, ఇంకొకవైపు వేర్వేరు కారణాలతో బలవన్మరణాలు అత్యధికంగా చోటుచేసుకున్నాయి. దేశంలో సగటున రోజుకు 418 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక డేటా ద్వారా వెల్లడవుతోంది. 2020 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 1,53,052 మంది బలవంతంగా తనువు చాలించారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది.
2019 గంటే గతేడాది ఆత్మహ త్యలు అధికంగా నమోదయ్యాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆ ర్‌బీ) వార్షిక నివేదించింది. ఇదే కాలంలో ఆత్మహత్యల రేటు (ప్రతి లక్షమందికి) కూడా పెరిగింది. 2019లో మరణాల రేటు 10.4 శాతం ఉండగా, గతేడా ది ఇది 11.3 శాతానికి చేరింది.
ఆత్మహత్యల జాబితాలో మహారాష్ట్ర ముందు వరుసలో నిలిచింది. అక్కడ 19,909 మంది బలవన్మరణం చెందారు. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (16.883), మధ్యప్ర దేశ్ (14,578), ప.బెంగాల్ (13,103), కర్ణాటక (12,259) నిలిచాయి. మొత్తం మరణాల్లో 50.1శాతం ఐదు రాష్ట్రాల్లో నమోదవగా, మిగతా 49.9 శాతం 23 రాష్ట్రాల్లోనివి కావడం గమనార్హం.
ఇక దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఆత్మహత్యలు (జనాభా దామాషా ప్రకారం) రికార్డయ్యాయి. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల రేటు 3.1 శాతంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతా ల్లో అత్యధిక జనాభా కలిగిన ఢిల్లిdలో ఎక్కువ బలవన్మరణాలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధానిలో 3142 మంది మరణించగా, పుదుచ్చేరిలో 408 మంది సూసైడ్ చేసుకున్నారు.