విశ్వ వేదికపై భారత్ తిరుగులేని రికార్డును పాకిస్తాన్ బద్దలు కొట్టింది. ఐసీసీ ప్రపంచ కప్‌లలో భారత్ చేతిలో ఇప్పటి వరకు 12 సార్లు ఓటమి పాలైన పాకిస్తాన్.. తొలిసారి అద్భుతమైన విజయం సాధించింది. ఐసీసీ ప్రపంచ కప్‌లో భారత్‌పై పాకిస్తాన్‌కు ఇది తొలి గెలుపు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓడిందనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు విశ్లేషకులు చెబుతు న్నారు.
పాక్‌తో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే భారత్ ఓడి పోయిందని పలువురు ట్వీట్లతో విమర్శిస్తున్నారు.
కొంపముంచిన తేమ
భారత్ ఓటమికి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు కారణం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ కంటే పాకిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. ముందుగా బౌలింగ్, ఆ పై బ్యాటింగ్‌లో పాక్ సత్తా చాటడమే భారత్ ఓటమికి కారణం. మైదానంలో టీమిండియా ప్లేయర్ల ముఖాల్లో ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించలేదు. ఈ మ్యాచ్ కోసం భారత్ బెస్ట్ ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగింది. అయితే పిచ్‌పై ఉన్న తేమను పాకిస్తాన్ వినియోగించుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి ఆధిపత్యం చెలాయించింది. ఇక పాక్ బ్యాటింగ్ వచ్చే సరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడంతో పాక్ ఓపెనర్లు సునాయా సంగా పరుగులు చేశారు.
బ్యాటింగ్ స్థానంలో మార్పు
ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేక పోవడం కూడా టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇరువురు చాలా ఘోరంగా విఫలం అయ్యారు. షాహీన్ అఫ్రిదీయే వీరిని ఔట్ చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో విరాట్ మినహా ఎవరూ రాణించలేదు. సూర్యకుమార్ యాదవ్, పంత్ బ్యాటింగ్ స్థానాల్లో మా ర్పులు కూడా ఓటమికి కారణం. వీరిద్దరు త్వరగా ఔటవ్వడంతో భార మంతా కోహ్లీపైనే పడినట్టయ్యింది.
తొలి ఆరు ఓవర్లు పాక్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఇక భార త్ బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ దెబ్బ తిన్నది. సరైన లయను అందుకోలేక పోయారు. బుమ్రాతో స్పెల్ ప్రారంభించ కుండా.. భువీకి బౌలింగ్ అప్పగిం చడం పాక్ బ్యాటర్లు సెట్ అయ్యే ందుకు అవకాశం ఏర్పడింది. యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు చాలా దూకుడు ప్రదర్శించారు. అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్లు చేజార్చుకున్నారు.
6 ఓవర్ల పవర్ ప్లేను ఉపయోగించుకోలేకపోయారు. కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు ఒత్తిడికి గురయ్యారు.
మంచు కురవడం కూడా స్పిన్నర్లకు అస్సలు కలిసి రాలేదు. పేసర్లు వికెట్ తీయలేకపోయిన సమయంలో.. స్పిన్నర్లు కూడా తేలిపో యారు. వరుణ్, జడేజాలు ఖాళీ చేతులతో మ్యాచ్ ముగించారు.
తొలి బ్యాటింగ్ ఈజీ కాదు.. : విరాట్
తాము అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపో యాం. పాకిస్తాన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిం చింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే 3వికెట్లు కోల్పోతే తిరిగి పుంజుకోవడం కష్టం. మొదటబ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. పాకిస్తాన్ బ్యాటింగ్‌కు పిచ్ ఎంతో బాగా అనుకూ లించింది. మంచు ప్రభావం కూడా ఉంది. తుది జట్టుపై ఎలాంటి బాధ లేదు. పాక్ గొప్పగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ కప్‌లో ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు..
అతిగా ప్రవర్తించొద్దు..
భారత్‌పై విజయం తరువాత.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజా మ్.. తమ బృందాన్ని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరి ప్రవర్తించొద్దని సూచించాడు. ఇది మెగా టోర్నీ.. టీమిండియాపై గెలిస్తే.. టోర్నీ గెలిచినట్టు కాదు. ప్రపంచ కప్ కొట్టాలి. తప్పకుండా సెలబ్రేషన్స్ చేసు కోవాలి.