తమిళనాడులో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ ,డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ వెల్లడించారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 07 ఎస్డీఆర్ఎఫ్ దళాలు పాల్గొంటున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి చెన్నైలో 150-200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆరు సంవత్సరాల తరువాత ఆదివారం చెన్నై నగరం మరోసారి నీటమునిగింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మొత్తం మూడు ప్రాంతాల్లో బృందాలను మోహరించింది.
ఈ సీజన్‌లో ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఇక్కడి ప్రాంతాల్లో వర్షాలు అత్యంత సాధారణం. అక్టోబర్ 26 నాటికి ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయని IMD అంచనా వేసింది. కానీ నైరుతి రుతుపవనాల తిరోగమనం ఆలస్యమైనందువల్ల ఈశాన్య రుతుపవనాల గమనం దాదాపు ఒక వారం ఆలస్యమైంది.దాంతో తమిళనాడును వర్షాలు వదలడం లేదు. గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. చెన్నై నగరం వానలు, వరదలతో అతలాకుతలం అవుతోంది.
మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి చెన్నైలో 150-200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, యానాం, కోస్తాంధ్ర, కేరళ, ఉత్తర కర్ణాటక, లక్షద్వీప్‌లపై ప్రభావం చూపిస్తాయి. ఈ సంవత్సరం కూడా ‘లా నినా’ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు బలోపేతమవుతున్నాయి.భారత్‌లో గత రెండు రుతుపవనాల సీజన్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల కారణంగానే 75 శాతం వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో నైరుతి నుంచి ఈశాన్య దిశగా గాలిలో ఏర్పడే మార్పుల కారణంగా ఈశాన్య రుతుపవనాలు బలంగా మారి వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, యానాం, కోస్తాంధ్ర, కేరళ, ఉత్తర కర్ణాటక, లక్షద్వీప్‌లపై ప్రభావం చూపిస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily