Tuesday, November 26, 2024

Big Story: సోలార్‌ పవర్‌ పై సింగరేణి ఫోకస్‌.. 8 ఏరియాల్లో 13 ప్లాంట్లు.. ఏటా 150కోట్ల ఆదా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సోలార్‌ ప్లాంట్లపై సింగ రేణి ప్రత్యేక దృష్టి సారిం చింది. దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇప్పటి వరకు సోలార్‌ విద్యుత్‌ ఉత్ప త్తి రంగంలోకి దిగలేదు. పర్యావరణ రహిత చర్యల్లో భాగంగా వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టిన సింగరేణి సంస్థ సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పు తున్నది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఏరియాల్లో 13 ప్లాంట్లను నెలకొల్పుతున్నది. ఈ ప్లాంట్లను మూడు దశల్లో పూర్తి చేయాలని, నిర్మాణ సంస్థలకు ఇప్పటికే కాంట్రాక్టు పనులను అప్పగించింది. మొదటి దశలో 129 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన కోసం నాలుగు ఏరియాల్లో ప్లాంట్ల నిర్మాణపు పనులు బీహెచ్‌ఈఎల్‌కు అప్పగిం చింది. దీనిలో ఆర్జీ-3లో 40మెగావాట్లు, ఇల్లందులో 39మెగావాట్లు, మణుగూర్‌లో 30మెగా వాట్లు, ఎన్టీపీసీ ఆవరణలో 10మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయి విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నాయి.

రెండో దశలో 90మెగావాట్ల సామర్థ్యంతో మూడు ఏరియాల్లో నాలుగు చోట్ల ప్లాంట్లు నిర్మించడం కోసం ఆదాని నిర్మాణ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. దీనిలో కొత్తగూడెం 37మెగావాట్లు, మందమర్రి- ఏ బ్లాక్‌లో 28మెగావాట్లు, మంద మర్రి- బి బ్లాక్‌లో 15మెగా వాట్లు, భూపాలపల్లిలో 10 మెగా వాట్ల నిర్మాణం పూర్త యింది. ఈ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పాదన కూడా ప్రారంభ మైంది. దీంతో సింగరేణిలో సోలార్‌ విద్యు త్‌ ఉత్పత్తి ఇప్పటికే 209 మెగావాట్లకు చేరింది. దీంతో థర్మల్‌ విద్యుత్‌తో పాటు సోలార్‌ విద్యుత్‌ రంగం లోకి అడుగుపెట్టిన ఘనత దేశంలో సింగరేణి కాలరీస్‌కే దక్కుతుంది.

పూర్తి కావస్తున్న మరో 81 మెగావాట్ల నిర్మాణం
మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తి కావస్తున్నది. ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని అదానీ, నోవాస్‌ గ్రీన్‌ అనే సంస్థకు సింగరేణి అప్పగించింది. వీటిలో నీటిపై తెలియాడే 15 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని జలాశయంపై నోవాస్‌ గ్రీన్‌ సంస్థ ఇప్పటిక ప్రారం భించింది. అదాని గ్రూప్‌ ఆర్జీ-3 ఓపెన్‌ కాస్ట్‌ డంప్‌పై 22మెగా వాట్లు, డోర్లీ ఓపెన్‌ కాస్ట్‌ డంప్‌పై 10 మెగా వాట్ల నిర్మా ణం తో పాటు కొత్త గూడెం, చె న్నూ ర్‌లో నేలపై నిర్మి ంచే 34 మెగా వాట్ల ప్లాం ట్ల నిర్మా ణా లు చేపడు తున్నా రు. ఈ నిర్మాణా లను ఈ ఏడాది చివ రి నాటికి పూ ర్తి చేయా లనే లక్ష్యం గా పెట్టు కోగా.. పను లు కూడా పూర్తికావచ్చా యని సం బం ధిత అధి కారులు చెబుతున్నారు.

సోలార్‌తో సింగరేణికి రూ.150 కోట్లు ఆదా
సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తయిన సోలార్‌ ప్లాంట్లను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 122.3 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. ఈ విద్యుత్‌ను విద్యుత్‌ సరఫరా సంస్థలైన ట్రాన్స్‌కో లైన్లకు అనుసంధానం చేసి సింగ రేణి వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనకు అవసర మైనంత మేర విద్యుత్‌ను సింగరేణి వినియోగించు కుంటుంది. తద్వారా రాష్ట్ర విద్యుత్‌ సంస్థ నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌ను సింగరేణి తగ్గించుకున్నది. దీంతో సంస్థకు రూ.75 కోట్ల మేర ఆదాయం పెరిగింది. సింగరేణి నిర్ధేశించుకున్న మేరకు 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన జరిగితే.. సంస్థకు ఏడాదికి దాదాపుగా రూ. 150 కోట్లు ఆదా కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement