Wednesday, November 20, 2024

Big Story: మ‌న ఢిఫెన్స్ మ‌రింత ప‌టిష్టం.. ర‌ష్యా నుంచి వ‌స్తున్న‌ ఎస్400 క్షిపణులు..

ఇండియ‌న్ డిఫెన్స్ సిస్ట‌మ్ మ‌రింత ప‌టిష్టం కానుంది. సుదూర లక్ష్యాల‌ను టార్గెట్‌గా చేసుకుని అటాక్ చేయ‌డం.. ఎయిర్ బేస్‌గా వ‌చ్చే ముప్పును ఎదుర్కోవడంలో కీలకంగా భావిస్తున్న‌ ఎస్400 క్షిపణులు ర‌ష్యా నుంచి ఇండియాకు వ‌స్తున్నాయి. భార‌త్ క్రమంగా డిఫెన్స్ సిస్ట‌మ్‌ను (Indian Defence System) పటిష్టం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్‌ 400 క్షిపణులు రష్యా (Russia) నుంచి స‌ప్ల‌య్ అవుతున్నాయి.

భారత్‌కు ఈ క్షిపణులను అందిస్తున్నామని రష్యా ఫెడరల్‌ సర్వీస్‌ ఫర్‌ మిలటరీ టెక్నికల్‌ కోపరేషన్‌ డైరెక్టర్‌ దిమిత్రి షుగావ్‌ తెలిపారు. అనుకున్న ప్రకారమే భారత్‌కు ఎస్‌ 400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైందని దుబాయ్‌ ఎయిర్‌ షో ప్రారంభానికి ముందు షుగావ్‌ వెల్లడించారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్‌ 400 క్షిపణుల సామర్థ్యం చాలా గట్టిది.

ఎస్400 క్షిపణులే ఎందుకంటే..
చైనాతో క్రైసిస్ China Crisis) తలెత్తిన లద్దాఖ్‌ సెక్టార్‌లో మొద‌టి క్షిప‌ణి మెహరించాలని ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్‌ నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించేందుకు ఇండియా స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కాగా, చైనా ఇప్పటికే రెండు ఎస్‌400 క్షిపణుల్ని(S 400 Missiles)లద్దాఖ్, అరుణాచల్‌‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో మోహరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement