సలసలకాగే నది.. ఎప్పుడైనా విన్నారా.. ఎక్కడైనా చూశారా? ఇంతవరకు కనీ, వినీ ఎరుగని ఓ వింత నది గురించి ఇప్పుడు డిటేయిల్డ్ గా చదివి తెలుసుకుందాం..
పెరువియాన్ అమెజాన్ నడి బొడ్డున ఈ అబ్బురపరిచే నది ఉంది. ఇది ఒక అసాధారణమైనది, ఇది అందరినీ కలవరపరిచే విషయం కూడా. ఎందుకంటే ఈ నది అన్ని నదుల్లా ఉండదు. చెరువులు, నదుల గురించి మనందరికీ తెలిసిందే. వాటిలో పారే పారే నీళ్లంటే.. చల్లగా ఉంటాయని, స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చని అందరూ అనుకుంటారు. కానీ, ఈ రివర్ వాటర్ అట్లాంటి ఇట్లాంటి వాటర్ కాదు. 80 డిగ్రీల సెల్సీయస్ లో మంటపెట్టి మరిగించినట్టు నిరంతరం సలసలమని మరిగిపోతూనే ఉంటాయి నీళ్లు. అవును.. ఈ రివర్ వాటర్ నిరంతరం మరుగుతూనే ఉంటుంది. బుస బుసమని పొగలు కక్కతూ ప్రవహిస్తుంది.
ఒకప్పుడు జానపథ కథలు, తన తాత చెప్పే సరదా స్టోరీస్ విన్న ఓ స్టూడెంట్ నిజంగా ఇట్లాంటి నది ఉంటుందా అని చిన్నప్పటి నుంచి ఆలోచన చేసేవాడు. అతనితోపాటే తన ఆలోచన కూడా పెరగి పెద్దదైంది. తను పీహెచ్ డీ చేస్తుండగా జియాలజిస్టుగా ఈ అంశాన్నే ఎంచుకున్నాడు. అతనే సదరన్ మెథడిస్ట్ విశ్వ విద్యాలయానికి చెందిన జియో ఫిజిసిస్ట్ అడ్రెస్ రూజో. అంతేకాదు ఆ జలమార్గాన్ని కనుగొనేందుకు తన ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు.
ఈ విస్మసయపరిచే నది విషయంలో రూజో ‘‘ది బాయిలింగ్ రివర్ , అడ్వెంచర్ అండ్ డిస్కవరీ ఇన్ ద అమెజాన్’’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. నది గురించి నిర్ఘాంతపరిచే చాలా విషయాలు ఆ బుక్ లో పొందుపరిచారు. ఆ నదిలో నీళ్లు కూడా 80 డిగ్రీల సెల్సియస్లో సలసలమని కాగుతుంటాయని పేర్కొన్నాడు.
బాల్యంలో ఉన్నప్పుడు తన తాతయ్య నోటి వెంట ఈ నది గురించి విన్నాడట. కానీ, ఆయన కూడా ఎప్పుడూ ఆ నదిని చూడలేదు. ఆ నదిని చూశాక కానీ తనకు అసలు విషయం తెలియలేదని.. మతిపోయిందని అంటున్నాడు రూజో. ‘‘ఈ నది నీళ్లు ఎప్పుడూ సలసలమని కాగుతుంటాయి. అదే ఈ నది పరిస్థితి. ఇవి ఎందుకలా సలసలా కాగుతున్నానేది ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధించలేకపోయారు. ఈ నదిని చూసి జియోలజిస్టులకు మతిపోయింది. అని తెలిపాడు రూజో.
‘‘నేను పెద్దయ్యేదాకా తాతయ్య చెప్పిన సలసలకాగే నది ఎట్లుంటుందో అనే విషయాలే వెంటాడేవి. అసలది ఎలా సాధ్యమనే ప్రశ్నే ప్రతిసారీ వేధించేది. తోటి విద్యార్దులు, సహచరులే కాకుండా ఆయిల్, గ్యాస్ కంపెనీలను కూడా సంప్రదించాను. కానీ, ఎవరూ దీని విషయం చెప్పలేకపోయారు. ఆ నది పరిసరాల్లో కూడా ఏ విధమైన వోల్కనో కూడా లేదు’’ అని తెలిపారు రూజో.
ఈ నదిలో పొరపాటున ఎవరైనా పడితే.. ఇక సజీవంగా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఒళ్లంతా వేడి నీటిలో ఉడికిపోయి మరణం సంభవించడం ఖాయం. అమెజాన్ అడవుల్లోని పెరూలో ఈ నది ప్రవహిస్తుంది. ఈ నది పేరు మయాన్త్యుయాకు (Mayantuyacu River). ఎంతో మంది జియాలజిస్టులు ఈ నదిపై పరిశోధన జరిపారు. కానీ, నీళ్లు మరిగేందుకు గల కారణాలను మాత్రం తెలుసుకోలేకపోయారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital