అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంగారక గ్రహం (మార్స్)పై ఒక చిన్నపాటి హెలికాప్టర్‌ను విజయవంతంగా ఎగురవేసింది. ఏప్రిల్‌లోనే నాసా ఈ ఘనత సాధించింది. ఇంజిన్యువిటీ అనే డ్రోన్ అప్పుడు ఒక నిమిషం కంటే తక్కువ సేపు గాల్లో ఎగురగలిగింది. మరో ప్రపంచంలో ఎగిరిన మొట్ట ముదటి విమానం ఇదే. భవిష్యత్తులో మార్స్‌పై మరిన్ని విమానాలు సాహసోపేతంగా ఎగురుతూ కనిపిస్తాయని నాసా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇంజిన్యువిటీ ఎంతో చక్కగా మార్స్‌పై చక్కర్లు కొడుతోందని, అస్సలు దీన్ని ఊహించలేదని నాసా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. 30 మార్టిన్ రోజుల్లో.. 5 విమానాలు తీసుకెళ్లడం నాసా లక్ష్యంగా పెట్టుకుంది.
మెరుగైన పనితీరు
ఇంజిన్యువిటీ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునేందు ప్రయత్నిస్తున్నామని జేపీఎల్ రోబోటిక్స్ ఇంజినీర్, ఇంజిన్యువిటీ మిషన్ టీం సభ్యుడు టెడ్డీ జానెటోస్ తెలిపాడు. రోజురోజుకూ ఇంజిన్యువిటీ ఎంతో మెరుగ్గా పని చేస్తోంది. ప్రయాణించే పరిధితో పాటు వేగం, ఎత్తు పెరుగుతోంది. ఇంజిన్యువిటీ నాసా శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేసింది. మే 22న ఆరో విమానంలో హెలికాప్టర్ నావిగేషన్ సిస్టమ్‌లో లోపం ఏర్పడింది. దీంతో అది ఎంతో భయకర కుదుపులకు గురైంది. ఎంతో ఊగిపో యింది. ఆ తరువాత.. హెలికాప్టర్ నావిగేషన్ సాఫ్ట్‌వేర్ ఓ చిత్రాన్ని తీసింది. సమస్యను ట్రాక్ చేయగలి గాం. దీంతో ఎలాంటి చర్యలు తీసుకో వాలో అంచనా వేశాం. ఒక వేళ సమ స్య గుర్తించ నిపక్షంలో హెలికాప్టర్ సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేయాలని భావించాం. ఒక నిమిషం లోపలే.. ఇంజిన్యువిటీ నుంచి ఒక చిత్రం పొందాం. తప్పులుగా భావిం చిన వాటిని సరిదిద్దే ప్రయత్నం లో ఇంజి న్యువిటీ ఎంతో బాగా సహక రించింది. జాయ్‌స్టిక్‌కు అనుగుణం గా కదలికలుఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. అదృష్టవశాత్తూ.. హెలికాప్టర్ దానికి ఉద్దేశించిన ల్యాండింగ్ ప్రదేశం నుంచి ఐదు మీటర్ల దూరంలో సురక్షితంగా అంగారక ఉపరిత లాన్ని తాకింది. జాయ్ స్టిక్‌కు అనుగుణంగా హెలికాప్టర్ పని చేయడం ప్రారంభించింది. ఎలా కోరుకు న్నామో.. అలాగే హెలికాప్టర్ తన మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్‌ను సేఫ్ ల్యాండింగ్ అసాధారణ విషయం. కానీ మేము తయారు చేసిన దానిపై ఎంతో నమ్మకం ఉంది. హెలికాప్టర్ ఇప్పుడు రోవర్‌కు ఎంతో మద్దతు ఇస్తోంది. ఎక్కడికి వెళ్లకూడదో రోవర్‌కు చెప్పడం ద్వారా.. హెలికాప్టర్ ఇప్పటికే తన విలువను నిరూపించుకుంది. ఇంజిన్యువిటీ.. తొమ్మిదో ఫ్లయిట్.. జులై 5న సౌత్ సెయిటా అని పిలువబడే ఇసుకమేట మైదానం మీదుగా హెలికాప్టర్‌ను తీసు కెళ్లింది. ఇది రోవర్‌కు సురక్షితంగా నడపడం కష్టంగా ఉండింది.
స్పష్టంగా చిత్రీకరణ
ఇంజిన్యువిటీ దక్షిణ సెయిటాలో కొన్ని రాక్ ఔట్ క్రాప్‌ల ఫొటోలు తీసింది. కక్ష్యలో ఉన్న అంతరిక్ష నౌక నుంచి తీసిన చిత్రా ల్లో ఇది ఎంతో స్పష్టంగా కనిపించింది. హెలికాప్టర్ నుంచి తీసిన 3డీ చిత్రాల్లో.. గట్లు, లోయలు, రాళ్లు స్పష్టంగా కనిపించాయి. రోవర్ బృందం.. పట్టుదలతో.. సుదీర్ఘమైన.. కష్టమైన.. ప్రమాద కరమైన డ్రైవ్‌ను సునాయసం చేస్తూ.. ముందుకు సాగాలని నిర్ణయించు కుంది. ఇంజిన్యువిటీ నావిగేషన్ సాఫ్ట్ వేర్.. దాని కింద ఉన్న నేల.. ఎల్లప్పుడూ.. ఫ్లాట్‌గా ఉండేలా ప్రోగ్రామ్ చేయబడింది. అక్టోబర్‌లో మార్స్‌పై నెలకొన్న పరిస్థితుల కు అనుగుణంగా.. రోటర్ బ్లేడ్‌ల వేగాన్ని నిమిషానికి 2,700 సార్లకు పెంచింది. ఇది మునుపటి 2,537 ఆర్‌పీఎం కంటే అధికం. 130 సెకన్లు మాత్రమే ఎగురుతుంది. దీని కంటే ఎక్కువ ఉంటే.. మోటార్లు చెడిపోయే ప్రమాదం ఉంది. గతంలో 170 సెకన్ల వరకు ఎగిరేది.
అంగారకుడిపై పరిశోధనలు..
ఏప్రిల్ 19వ తేదీన తొలిసారి ఇంజిన్యువిటీ మార్స్‌పై ఎగిరింది. అప్పుడు నమోదైన ఆర్‌పీఎం.. ఎగిరిన ఎత్తు.. ప్రయా ణించిన దూరం.. వేగాన్ని బద్దలు కొట్టింది. నది డెల్టాకు సమీపం లో ఉన్న జెజెరో క్రేటర్‌ను అన్వేషించడానికి ఇది రోవర్‌కు సాయం చేస్తోంది. అక్కడ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంజిన్యువిటీ మార్పులు తీసుకుంటోంది. కాలిఫోర్నియాలోని పసాదేనాలో ఉన్న ఇంజిన్యువిటీ చీఫ్ ఇంజినీర్ బాబ్ బలరామ్ మాట్లాడుతూ.. జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నాం. ఇది ఇప్పుడు గాడిలో పడింది. ఏప్రిల్‌తో పోలిస్తే.. ఇంజిన్యువిటీ చాలా దూరంగా.. వేగంగా.. ఎత్తులో ఎగురుతోంది. హెలికాప్టర్ మార్స్ ఉపరితలం నుంచి గరిష్టంగా 12 మీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. సెకన్‌కు ఐదు మీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. 625 మీటర్లను కవర్ చేసింది. ఇది అంగారక గ్రహంపై ఉన్న విలువైన సమాచా రాన్నిరాబట్టేందుకు ఎంతో దోహదపడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..