పలు స్పాలలో వ్యభిచారపు రాకెట్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి వీలుగా ఢిల్లీ మహిళా కమిషన్ (Delhi Commission for Women) (DCW) జస్ట్ డయల్‌కు (justdial) సమన్లు జారీ చేసింది. జస్ట్ డయల్ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీలోని స్పాలలో (Spa in Delhi) నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్లపై ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఈ మధ్య పలు ఫిర్యాదులు అందాయి. జస్ట్ డయల్ పై దర్యాప్తు చేయడానికి కమిషన్ ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ ఢిల్లీలో ఉన్న స్పాల వివరాలను తమకు అందించాలని కమిషన్ బృందం కోరింది. అయితే ఇట్లా ఆదేశించిన 24 గంటల్లో కొన్ని స్పాల బాగోతాలపై మహిళా కమిషన్‌కు సామాన్య జనం నుంచి పెద్ద ఎత్తున కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి.
అయితే.. కమిషన్ బృందం (Commission team) స్పా సేవల వివరాలను అందించాలని అభ్యర్థించగా.. అమ్మాయి కోసం అభ్యర్థనగా భావించి స్పాల మాటున సాగిస్తున్న అక్రమ వ్యభిచార కార్యకలాపాలకు (prostitution activities) సంబంధించిన వివరాలను వెంటనే అందించారు.
దీంతో స్పాల మాటున వ్యభిచారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిపై కేసులు నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను (Crime Branch) కమిషన్ కోరింది. ఈ స్పాలలో 150 కంటే ఎక్కువ మంది యువతుల ఫోటోలతో పాటు వారి సేవలకు సంబంధించిన రేట్లను కూడా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి. www.twitter.com/AndhraPrabhaApp, www.facebook.com/andhraprabhanewsdaily