Friday, November 22, 2024

Big Story: మ్యూజిక్ వినడం మంచిదే.. మెంటల్ స్ట్రెస్ తగ్గించి.. ఎనర్జిటక్ ఉంచుతుంది..

ప్రకృతి అందాలు.. పచ్చదనం, పూలతోటలు, సెలయేరు.. మంచుకొండలు, ఎత్తైన ప్రదేశాలు.. వీటన్నిటితో  పాటు మంచి మ్యూజిక్ కూడా మనసుకు హాయిగా ఉంటుంది. ఇవన్నీ అందరికీ ఎంతో రిలీఫ్ ఇస్తాయి.. అయితే.. చాలామంది అదే పనిగా మ్యూజిక్ వింటుంటారు. వాళ్ల ప్రొఫైల్ లో కూడా మ్యూజిక్ లవర్స్ గానే పేర్కొంటారు. అయితే ఇది వాళ్ల హెల్త్ కి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. మ్యూజిక్ వినడం విల్ల స్ర్టెస్ తగ్గి.. మెదడు కూడా చాలా ఉత్తేజితంగా ఉంటుందంటున్నాయి పలు సర్వేలు.  అయితే అదేపనిగా ఎక్కువ సౌండ్స్ తో వినడం హెల్త్ ని దెబ్బతీస్తుందంటున్నారు డాక్టర్లు.

సంగీతం మెదడు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. తాజాగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారు కూడా మ్యూజిక్‌తో ఉత్తేజితులయినట్టు కొత్తగా జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో అల్జీమర్స్‌తో బాధపడేవారికి, బ్రెయినన్‌  స్ట్రోక్‌ వచ్చినవారికి మెదడు గాయాల చికిత్సలోనూ సంగీతం కీలకపాత్ర పోసించినట్టు తేలింది.

అందుకే పరిశోధకులు ‘న్యూరోలాజిక్‌ మ్యూజిక్‌ థెరపీ’ అనే చికిత్సా విధానాన్ని ముందుకు తెస్తున్నారు. మాటలు, కదలిక, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించే భాగాలను మ్యూజిక్ ఉత్తేజితం చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. దీంతో మెదడు తనంతట తానూ మరమ్మతు చేసుకునేందుకు సంగీతం సాయపడుతున్నట్టు తేలిందన్నారు.  అల్జీమర్స్‌ ఉన్నవారిని కూడా కొన్ని పాటలు ప్రతిస్పందించేలా చేస్తాయంటున్నారు.

జ్ఞాపకశక్తిని పెంచడానికి మ్యూజిక్ ఎంతో ఉపయోగపడుదుంటున్నారు వైద్య నిపుణులు. మెదుడులోని ఏదైనా సమస్యతో.. మాటలు కోల్పోయిన వారికి కూడా ‘మ్యూజిక్‌ థెరపీ’తో సానుకూల ఫలితాలే లభించాయని పరిశోధకులు చెబుతున్నారు. ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీలానే మ్యూజిక్‌ థెరపీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement