కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ సర్కార్ ఆందోళనలు చేపట్టాలన్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? గతంలో కేంద్రంతో క్లోజ్‌గా మూవ్ అయిన సీఎం కేసీఆర్ ఈ మధ్య ఎందుకు స్టెప్ బ్యాక్ అయ్యారు. ఈ రెండ్రోజుల నుంచి ఎందుకు ఫైర్ అవుతున్నారు? తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆరెస్‌గా పొలిటికల్ హీట్ పెరగడం వెనుక అసలు కారణమేంటి? అన్న ప్రశ్నలు తెలంగాణ సమాజంలో వెల్లువెత్తుతున్నాయి..
హుజురాబాద్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆరెస్‌గా పొలిటికల్ హీట్ పెరిగింది. రెండు పార్టీల పెద్దల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో దూకుడు పెంచాలని భావించిన టీఆరెస్ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ప్రజలకు తెలిసేలా చేయాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశం పెట్టగానే ఎప్పుడూ లేని విధంగా సంజయ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం కేసీఆర్.
ఇది కూడా చదవండి:Big Story: మోడీ సర్కారుపై వార్.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంచలన ప్రకటన..
బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనమని తేల్చి చెప్పిందని బీజేపీ నేతలకు గుర్తు చేశారు కేసీఆర్. ఇదే సమయంలో తెలంగాణ రైతులకు వరి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కొనదో అని బీజేపీ నేతలు అనడం ఏ విధంగా ఉంటుందో చూడాలని ప్రశ్నించారు సీఎం.
రైతులు మోసపోకుండా లాభసాటి పంటలను వేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. అదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.