Tuesday, November 26, 2024

Big Story: ఆ నర్సు ఇంట్లో హై క్వాలిటీ కండోమ్స్.. 150 మందితో శృంగారం..

ఆమె ఓ సీనియర్ నర్సు.. తమిళనాడు రాష్ట్రంలోని తేనీ జిల్లా అండిపట్టి ప్రభుత్వ హాస్పిటల్ లో జాబ్ చేస్తుంది. తన భర్త కేటరింగ్ సర్వీస్ చేస్తాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్యోన్యంగా జరుగుతున్న కాపురంలో అవాంతరాలు వచ్చాయి. ఎందుకనో వాళ్లిద్దరి మధ్య తరుచూ తగాదాలు వచ్చేవి.. విభేదాలతో ఎంతో కాలం ఉండలేమని భావించి  విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అండిపట్టి హాస్పిటల్ లో జాబ్ చేస్తున్న నర్సు సెల్వీ పప్పమ్మల్ పురంలో ఉంటుండగా.. తన భర్త సురేశ్ పిల్లలతో కలిసి మధురై దగ్గర్లోని దిండిగుల్ లో ఉంటున్నాడు..

అయితే.. రెండు మూడు రోజులుగా సెల్వీ (43) ఉంటున్న ఇంటి డోర్లు ఓపెన్ కాకపోవడం.. తను అస్సలు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఆమె భర్త సురేశ్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో సురేశ్ ఆమె పర్సనల్ ఫోన్ కి కాల్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో డౌటొచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. కాగా, పోలీసులు ఆ ఇంటికి వచ్చి డోర్లు బద్దలుకొట్టి ఇంట్లోకెళ్లి చూడ్డంతో షాక్ కి గురయ్యారు.

తల, ముఖంపై గాయాలతో నర్సు సెల్వి ఇంట్లోని ప్రార్థనా మందిరంలో అనుమానాస్పందంగా పడి ఉంది. ఆమె  దారుణ హత్యకు గురయ్యిందని పోలీసులు కనుగొన్నారు.  కాగా, ఆమె ఇంట్లో 500 హై క్వాలిటీ కండోమ్స్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆమె ఫోన్ ను పరిశీలించిన దర్యాప్తు అధికారులు వాస్తవాలు తెలుసుకుని విస్తుపోయారు. నవంబర్ లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాల కోసం ఆమె ఇంటిని పలుమార్లు పరిశీలించారు. ఈ క్రమంలో 500 హై క్వాలిటీ కండోమ్స్ వారికి లభించాయి. అయితే ఆమె పలువురితో వివాహేతర సంబంధం కొనసాగించినట్టు పోలీసులు విచారణ సందర్భంగా గుర్తించారు.

ఆమె ఫోన్ లో దాదాపు 300 మంది కాంటాక్ట్ నెంబర్లు ఉండగా.. అందులో 150 మంది మగాళ్లతో ఆమె ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వారితో శృంగారం చేసేదని ఎంక్వైరీలో తేలిసింది. అయితే.. ఈ హత్య చేసిందెవరనే దానిపై మరింత లోతుగా విచారించిన అధికారులకు కంబం గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే రామచంద్రప్రభు (34)పై డౌటొచ్చింది. వీరిద్దరికి చాలాకాలంగా వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టు గుర్తించారు.

విచారణకు హాజరు కావాలని పోలీసులు రామచంద్రప్రభుకు సమన్లు పంపగా ఊహించని రీతిలో ఆ మరుసటి రోజే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇతరత్రా ఆధారాలతో సెల్విని హత్య చేసింది రామచంద్ర ప్రభు అని తేల్చారు. కాగా, ఆమెతో రిలేషన్ పెట్టుకున్న వారిలో కొందరు పోలీసులు, డాక్టర్లు, ఆటో డ్రైవర్లు కూడా ఉన్నట్లు విచారణలో కనుగొన్నారు పోలీసులు. కాగా, ఈ కేసు దర్యాప్తులో ఎస్పీ ప్రవీణ్ ఉమేశ్ డొంగ్రే, స్పెషల్ టీమ్ ఆఫీసర్ తంగ క్రిష్ణణ్, ఇన్ స్పెక్టర్ శివకుమార్ తో పాటు ఫొరెన్సిక్ డిపార్ట్ మెంట్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని కనుగొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement