Thursday, November 21, 2024

Big Story: ఫోర్ మోర్ షాట్స్.. చీర్స్ ఫ‌ర్ తెలంగాణ‌! ఒక్క బీరు బాటిల్‌పై 70శాతం ట్యాక్స్..

తెలంగాణ‌కు లిక్క‌ర్ కిక్కు మామూలుగా లేదు. క‌ష్టాలు, బాధ‌లు, సంతోషం ఏ ఎమోష‌న్ వ‌చ్చిన‌ జ‌నం చిల్ అవుతూ చీర్స్ కొడుతుంటే.. ప్ర‌భుత్వానికి మాత్రం ఆదాయం అంతే స్థాయిలో కిక్కు తెస్తోంది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌కు సంబంధం లేకుండా డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు నిరంత‌రం పెరుగుతున్నాయి. కానీ, తెలంగాణ ఏర్ప‌డ్డ నాటి నుంచి మాత్రం లిక్క‌ర్ రేట్లకు రెక్కలొచ్చిన‌ట్టు అయ్యింది. వాటి ధ‌ర‌ల పెరుగుల‌కు అంతులేకుండా పోయింది. నాలుగు సార్లు లిక్కర్ రేట్ల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఒక అంచ‌నా ప్ర‌కారం.. మ‌ద్యం బాటిల్ ధ‌ర‌లో 70శాతం ప‌న్ను ప్ర‌భుత్వానికి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన లిక్క‌ర్ పాల‌సీ కార‌ణంగానే రెండేళ్లుగా ఖ‌జానా గ‌ల్లాపెట్టె గ‌ల‌గ‌ల‌లాడుతోంది. దీంతో 54,000 కోట్ల ఆదాయం స‌మ‌కూరిన‌ట్టు తెలుస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు 650 ఎంల్ గల బీర్ బాటిల్ త‌యారీకి దాదాపు 22 రూపాయ‌ల ఖ‌ర్చు అవుతుంది. కానీ, బీరు కొనుగోలుదారుల‌కు మాత్రం దాన్ని 140 రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. దీంట్లో సింహ‌భాగం అంటే.. ఒక్క బీరు బాటిల్‌కు తెలంగాణ ప్ర‌భుత్వానికి వ‌చ్చేది 99రూపాయ‌లు. మిగిలిన‌ది మార్జిన్‌గా రిటైల‌ర్ల‌కు వెళ్తుంది.
“చవకైన మ‌ద్యం ధరలలో 80% పన్నులు ఉన్నాయి. బ్రాండెడ్ మద్యంపై 70% పన్నులు ఉంటాయి. ఫలితంగా.. పొరుగున ఉన్న క‌ర్నాట‌క‌ మద్యం ధరలతో కంపేర్ చేసిన‌ప్పుడు కనీసం 40 రూపాయ‌ల నుంచి 50 రూపాయ‌ల దాకా ధ‌ర‌ల్లో తేడా ఉంది” అని కొంత‌మంది అధికారులు తెలిపారు.

telangana assembly liquor policy.. cm kcr

తెలంగాణ తీసుకొచ్చిన లిక్క‌ర్ పాల‌సీతో గ‌త రెండేళ్ల‌లో 54,583 కోట్ల రూపాయ‌ల ఆదాయం ప్ర‌భుత్వ ఖ‌జానాకు స‌మ‌కూరింది. అంతేకాకుండా ట్యాక్సుల రూపంలో 38,200 కోట్లు, షాపుల‌కు టెండ‌ర్లు, ద‌ర‌ఖాస్తుల ఫీజుల రూపంలో మ‌రో 3,000 కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ 2014వ సంవ‌త్స‌రం నుంచి ప్ర‌భుత్వం మ‌ద్యంపై నాలుగు సార్లు ట్యాక్సుల‌ను పెంచుతూ వ‌చ్చింది. 2015లో 8శాతం, 2017లో 10శాతం, 2019 డిసెంబర్లో 20శాతం పెంచింది ప్రభుత్వం. అంతేకాకుండా కొవిడ్ 19 సెస్ కింద మరో 22శాతాన్ని పెంచి ఆమ్దాని కమాయిస్తోంది ప్రభుత్వం. అయితే.. ఇతర రాష్ట్రాలు కొవిడ్ సెస్ విత్ డ్రా చేసుకున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా కొవిడ్ సెస్ పేరిట పెంచిన ధరలు తగ్గించడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement