దేశంలో తొలి ఫుడ్ మ్యూజియం ప్రారంభమైంది. పొలం నుంచి తినే పల్లెం దాకా ఫుడ్ ఎట్లా వస్తుందన్న అంశాలను డిజిటల్ ప్రోగ్రాం ద్వారా వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తంజావూర్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఆఫీసులో దీన్ని ఏర్పాటు చేశారు. కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మ్యూజియాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తంజావూర్‌లో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో ఎఫ్‌సీఐ సౌత్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు తల్జిత్ సింగ్, చీఫ్ జనరల్ మేనేజర్ సంజీవ్‌కుమార్ గౌతమ్, జనరల్ మేనేజర్ సింగ్ పాల్గొన్నారు.
దాదాపు 1,860 అడుగుల విస్తీర్ణంలోని ఈ మ్యూజియాన్ని ఎఫ్‌సీఐ, బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం సంయుక్తంగా రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రకాల ధాన్యాల సేకరణ విధానం, సవాళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తిని వివరించేలా మోడ్రన్ టెక్నాలజీతో ఈ మ్యూజియాన్ని రూపొందించారు. పంట పొలాల నుంచి ప్రజల పల్లెం వరకు ఫుడ్ ఎలా చేరుతుందనే ప్రస్థావనను డిజిటల్ విధానంలో ప్రదర్శించేలా ఇక్కడ ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily