కరోనా మహమ్మారి తీవ్రత తగ్గింది.. ఇప్పుడిప్పుడే జనాలు నార్మల్ లైఫ్(Normal Life)లోకి వస్తున్నారు. అయినా ఇంకా దాని ఎఫెక్ట్ (Effect)పోలేదు. వ్యాక్సినేషన్ కొంత స్పీడ్ అయినా ఇంకా చాలామంది టీకా వేసుకోలేదు. అయితే కరోనా కాలంలో చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఎంతో మంది జాబ్ (Job) కోల్పోయారు. వారి కుటుంబాలు (Families) ఫైనాన్షియల్ క్రైసిస్‌ను ఎదుర్కొంటున్నాయి. చాలామంది ఈఎంఐలు (EMI) చెల్లించలేక.. బ్యాంకులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి..
వీటన్నిటినీ ఒకసారి యాది చేసుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది.. ఇంకా ఎందుకు బతికి ఉన్నామా అనే పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు చాలా మంది.. మరి ఇట్లాంటప్పుడే నిబ్బరంగా ఉండాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు.. ఉద్యోగం లేని సమయంలో ఒక వ్యక్తి రోజూ తాను వెతుకున్న ఉద్యోగ అనుభవాన్ని పక్కన బెట్టి, అతడు లేదా ఆమె చూసిన అన్ని ఉద్యోగాలను ప్రయత్నించాలి.. ఎగిసే అలలా ప్రయత్నం ఉండాలి కానీ.. తీరం చేరిన అలలా నిరుత్సాహపడొద్దంటారు నిపుణులు.
కొన్నిసార్లు వ్యక్తిత్వానికి సరిపోని ఉద్యోగానికి కూడా ప్రయత్నించి ఉండొచ్చు. ఇది నిరుద్యోగం (Umemployement) కలిగించే ఒత్తిడి కారణంగా ఇలా చాలామంది చేస్తారు. కానీ, అది తప్పు అంటారు పరిశీలకులు. అందుకే ముందుగా నైపుణ్యాల జాబితాను అనుసరించి తదనుగుణంగా ఉద్యోగాల కోసం అన్వేషణ చేయాలంటున్నారు. దీంతో చాలామటుకు స్ట్రెస్‌కు మించిన ఆత్మవిశ్వాసం ఉంటుంది.
రోజూ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల శరీరమే కాకుండా మనస్సు కూడా స్పష్టంగా.. హెల్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పుడు ఎప్పటిలాగే ఉత్సాహంగా వర్కౌట్ చేయడం వల్ల ఒత్తిడి ఎక్కడ ఉందో తెలియకుండానే మాయమైపోతుంది. కాబట్టి రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వర్కౌట్ చేయడం మంచిది.
అట్లాగే.. మీ ఫ్రెండ్స్.. రిలేటివ్స్‌తో చాట్ చేయండి. మీటింగ్, మాట్లాడటం వారితో సరదాగా గడపడం ఆన్‌లైన్ గేమ్స్ లేదా సినిమాలు చూడటం వంటివి కూడా స్ట్రెస్ బస్టర్స్‌గా సహాయపడతాయి.
స్కిల్ డెవలప్మెంట్..
పుస్తకాలు చదవడం, ఇంట్లో హ్యాండ్‌మేడ్ ఐటమ్స్ తయారు చేయడం, పెయింటింగ్ వేయడం.. మ్యూజిక్ వంటివి ప్రయత్నిం చండి. కొన్ని మీకు తెలియని.. మీలో అంతర్లీనంగా నైపుణ్యాలను బయటపెట్టడం కానీ.. కొత్తగా నేర్చుకోవడం కానీ, డెవలప్‌మెంట్ చేసుకోవడంతో సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తి పెరుగుతుంది.
వీటన్నిటితోపాటు మంచి నిద్ర కూడా అవసరమే.. అయినప్పటికీ నిరుద్యోగ సమయంలో ఎక్కువసేపు నిద్ర పోవడం వల్ల అది డిప్రెషన్‌కు దారితీస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నివారించడానికి 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోకుండా చూసుకోవాలి. ఉదయాన్నే లేచి వర్కౌట్ ట్రై చేయండి. పని కోసం చేసే అన్నింటినీ ఉత్సాహాంగా చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. మీలో కొత్త ఎనర్జీ రావడంతో పాటు మీ పనిమీద వందకు వంద శాతం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆల్ ద బెస్ట్..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి:
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily