Thursday, November 7, 2024

Big Story: ఈ ఏడాది 126 పెద్ద‌పులుల‌ మృతి.. పదేళ్లలో ఇదే అత్యంత దారుణం..

దేశంలో పెద్దపులుల మరణాలు పెరిగాయని.. పదేళ్ల కాలంలో మునుపెన్నడూ లేని రీతిలో 2021లో పులులు చనిపోయాయని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది కాలంలో 126 పెద్దపులులు చనిపోయినట్టు వెల్లడించింది. కాగా, పదేళ్ల కాలంగా ఉన్న డేటాను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అనలైజ్ చేసి వివ‌రాలు వెల్ల‌డించింది. అయితే, మధ్యప్రదేశ్ లో ఈ మద్యనే ఒక పులి చనిపోవడం గమనార్హం.

ప్రపంచంలోనే 75శాతం పులులకు భారతదేశం ఆవాసంగా ఉందని, 2006లో 1,411 పులులు ఉండగా.. రెండేళ్ల క్రితం చేపట్టిన పులుల గణనలో 2,967కు పెరిగినట్టు అధికారులు తెలిపారు. పులుల సంఖ్య పెరగడాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా గర్వంగా ప్రకటించారు. స్ట్రిప్ ప్యాటర్న్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ఆధారంగా పులులను గుర్తించడానికి ప్రత్యేకంగా కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేసినట్టు సంరక్షణ సంస్థ తెలిపింది.

అయితే.. ఈ మధ్య పులల సంఖ్య తగ్గిపోయి ఉండవచ్చు కానీ, అవి సహజ మరణాలైతే కావని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇండియాలో ఈమధ్య కాలంలో అడువుల్లో వేటగాళ్ల సంచారం ఎక్కువైందని, వన్యప్రాణులపై వేట పెరిగిందని పేర్కొన్నారు. వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ జంతువులను హతమారుస్తున్నట్టు పేర్కొన్నారు. పులుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతోంది. జంతువుల కోసం దేశవ్యాప్తంగా 50 రిజర్వ్ ఫారెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది కేంద్రం. అంతేకాకుండా పులుల సంరక్షణకు ఇండియా చేపడుతున్న చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 మధ్య కాలంలో పులుల దాడిలో దాదాపు 225 మంది చనిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement