Tuesday, November 26, 2024

డెక్కన్ సిమెంట్స్ కు  భారీ షాక్.. మైనింగ్ ఆపేయాలని హైకోర్టు ఆర్డర్

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం రావిపహాడ్ పరిధిలో ని దక్కన్ సిమెంట్ (సున్నపురాయి గని-III) మైనింగ్ నిలిపివేతకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 26&27లోని 183.11 (457.77ఎకరాలు) హెక్టార్లలో జరుగుతున్న చట్టవ్యతిరేక మైనింగ్ నిలుపుదలకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడిన దిసభ్య ధర్మాసనం ఇవ్వాల ఈ ఆదేశాలిచ్చింది. గని-II,  గని-III లో జరిగిన చట్టవ్యతిరేక మైనింగ్ నకు అపరాధ రుసుం విదించాల్సిందిగా గతంలోని మైనింగ్ శాఖను ఆదేశిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. ఎన్జీటీ ఉత్తర్వులను హైకోర్టు కూడా సమర్ధించడం గమనించదగ్గ విషయం. కామన్ కాజ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా(2017) కేసు ప్రకారం అపరాధ రుసుము వసూలు చేయాలని ఎన్జీటీ ఆదేశాలున్నాయి.  కాగా, ఎన్జీటి ఉత్తర్వులపై ఇప్పటిదాకా డెక్కన్ సిమెంట్స్ అప్పీలుకు వెళ్లలేదు. ఈ విషయంలో దాదాపు రూ.600 కోట్లు అపరాధ  రుసుం విధించవచ్చని తెలుస్తోంది.

ఇటీవలే 4.7 MTPA సామర్థ్యంతో సిమెంట్ ప్లాంట్-IIIనిర్మాణం,  మైనింగ్ ఉత్పత్తి 2.3MTPA నుంచి 4.6MTPA పెంపుదలకు డెక్కన్ సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసింది. కాగా, కోర్టు ఉత్తర్వులతో ఈ కార్యకలాపాలు పూర్తిగా నిలిపోనున్నాయి. సామాన్యుడి ఫిర్యాదుతో స్పందించిన హైకోర్టు మైనింగ్ యాక్టివిటీస్ ని నిలిపేయాలని ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement