ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా Apple iPhone XRని కేవలం రూ.18,599 లకే అందుబాటులో ఉంచింది. అయితే ఈ రేటుకి ఫోన్ పొందాలంటే కొన్ని ఆఫర్లను యాడ్ చేసుకుని మొబైల్ ను కొనుగోలు చేయాల్సి ఉంది. Apple iPhone XR బేస్ వేరియంట్ (64 జీబీ) ప్రస్తుతం అమెజాన్ లో రూ.34,999 ధరకు విక్రయిస్తున్నారు. దానికి అదనంగా, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా రూ.14,900 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
దీంతో పాటు యస్ బ్యాంక్ లేదా అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డ్ ల నుంచి EMI ద్వారా లావాదేవీని చేస్తే, అదనంగా రూ.1500 తగ్గింపు పొందొచ్చు. దాంతో దాదాపు రూ.35 వేల విలువ కలిగిన ఐఫోన్ కేవంల రూ. 18,599 లకే మీ సొంతం అవుతుంది..
iPhone XRపై అమెజాన్ లో ఆఫర్లు..
1) ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా అత్యధికంగా రూ.14,900 తగ్గింపు లభించే అవకాశం.
2) ఎంపిక చేసిన కార్ట్ లపై నో కాస్ట్ EMI అందుబాటులో ఉంటుంది.
బ్యాంకు ఆఫర్లు:
1) సిటీ యూనియన్ బ్యాంక్ డెబిట్ మాస్టర్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.1500 తక్షణ తగ్గింపు.
2) అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 1500 తక్షణ తగ్గింపు (7.5% డిస్కౌంట్).
3) యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 1500 తక్షణ తగ్గింపు.
4) HSBC క్యాష్‌బ్యాక్ కార్డ్ లావాదేవీలపై 5% తక్షణ తగ్గింపు.
iPhone XR వేరియంట్ 2018లో భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించింది. 64 GB, 128 GB, 256 GB స్టోరేజ్ వేరియంట్స్ తో నలుపు, నీలం, పసుపు, పగడపు, ఎరుపు రంగులలో లభిస్తుంది. Apple iPhone XR లో లిక్విడ్ రెటినా డిస్ ప్లేతో కూడిన 6.1 అంగుళాల LCD స్క్రీన్, స్టీల్ కు బదులుగా అల్యూమినియం బాడీని కలిగి ఉన్నాయి.