ఉక్రెయిన్ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న విద్యార్థులకోసం ఉత్తర రైల్వే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్-3 , ముంబై విమానాశ్రయంలో ఈ ప్రత్యేక రైలు రిజర్వేషన్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుండి ప్రజలు నేరుగా తమ సొంత రాష్ట్రానికి టిక్కెట్‌ను తీసుకోవచ్చు. ఈ కౌంటర్ల నుంచి విద్యార్థులకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కన్ఫర్మ్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం కారణంగా పరిస్థితులు తీవ్రమవుతున్న దృష్ట్యా అక్కడి నుంచి వీలైనంత త్వరగా భారతీయ విద్యార్థులను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తరపున ఆపరేషన్ గంగా నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా విద్యార్థులను, భారతీయులను అక్కడి నుంచి వేర్వేరు విమానాల ద్వారా వెనక్కి తీసుకువస్తున్నారు.వాస్తవానికి, ఉక్రెయిన్-రష్యా వంటి దేశాలలో, యుపి, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుండి విద్యార్థులు వైద్య విద్య కోసం వెళతారు, కాబట్టి ఈ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్‌లో సుమారు 20,000 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. 14,000. విద్యార్థులను తీసుకొచ్చారు. మరోవైపు భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులను ఆదుకునేందుకు రైల్వేశాఖ కూడా చొరవ తీసుకుంది.
Breaking : ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చే విద్యార్థులకోసం – రైల్వేశాఖ ప్రత్యేక సౌకర్యాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement